AP Jobs

APPSC ASO Jobs 2026: 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల….. వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month September 30, 2026 person chitra

APPSC ASO Jobs 2026: 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల….. వెంటనే అప్లై చేసుకోండి.

APPSC ASO Jobs 2026:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 196 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధిత విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పే స్కేల్ ప్రకారం జీతం, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు, విద్యార్హత, వయస్సు, ఎంపిక విధానం, ఫీజు మరియు దరఖాస్తు ప్రక్రియను కింది విధంగా తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఉద్యోగాలు

పోస్టు పేరు: Assistant Statistical Officer (ASO) పోస్టులు

మొత్తం ఖాళీలు: 196

ఉద్యోగ రకం: ప్రభుత్వ ఉద్యోగం

అనుభవం: అవసరం లేదు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

ASO పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.

Statistics : ప్రధాన సబ్జెక్టుగా B.A./B.Sc. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Mathematics : ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే డిగ్రీలో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల్లో ఏదో ఒక సమయంలో Statistics ఒక పేపర్‌గా చదివి ఉండాలి.

Economics: ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీలో Statistics ఒక పేపర్‌గా చదివి ఉండాలి.

Commerce: ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీలో Statistics ఒక పేపర్‌గా చదివి ఉండాలి.

Computer Science : ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీలో Statistics ఒక పేపర్‌గా చదివి ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి.

రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన SC, ST, BC, EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ₹250 ఫీజు చెల్లించాలి.

ఫీజు చెల్లింపు విధానం మరియు ఇతర రుసుములు ఉంటే అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

జీతం వివరాలు :

Assistant Statistical Officer పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹37,640 – ₹1,15,500 పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది.

పే స్కేల్‌తో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. ప్రారంభ వేతనం పోస్టింగ్, అలవెన్సులు మరియు ప్రభుత్వ నిబంధనల ఆధారంగా మారవచ్చు.

ఎంపిక విధానం :

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను దశలవారీగా నిర్వహిస్తారు.

రాత పరీక్ష

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)

మెరిట్ ఆధారంగా ఎంపిక

సర్టిఫికెట్ల పరిశీలన

ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక APPSC నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్‌ ( https://portal-psc.ap.gov.in/ ) ను ఓపెన్ చేయాలి.

2. సంబంధిత ASO Recruitment 2026 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

3. మీ విద్యార్హత, వయస్సు తదితర వివరాలను చెక్ చేసుకోవాలి.

4. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

5. అడిగిన వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.

6. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

7. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

8. అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ లేదా PDF కాపీని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు 13 అక్టోబర్ 2026 నుంచి 2 నవంబర్ 2026 వరకు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Notification Pdf : Click Here

Apply Online : Click Here 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *