AP Jobs

APPSC Hostel Welfare Officer Jobs 2026: డిగ్రీ అర్హతతో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. అక్టోబర్ 9 నుంచి దరఖాస్తులు… వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month October 6, 2026 person chitra

APPSC Hostel Welfare Officer Jobs 2026: డిగ్రీ అర్హతతో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. అక్టోబర్ 9 నుంచి దరఖాస్తులు… వెంటనే అప్లై చేసుకోండి.

APPSC Hostel Welfare Officer Grade 2 Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ శాఖల్లో మొత్తం 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.అక్టోబర్ 29, 2026 అప్లికేషన్‌కు చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోపు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 21 పోస్టులు

ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 23 పోస్టులు

బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 29 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 73 పోస్టులు

విద్య అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (Degree) లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించిన వయోపరిమితి, వయస్సు సడలింపు తదితర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉంటాయి.

జీతం వివరాలు :

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు పే స్కేల్ లభిస్తుంది.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు అలవెన్సులు, ఇతర ఉద్యోగ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.

3. మీ అర్హతలను పరిశీలించి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

4. అడిగిన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.

5. అవసరమైన సర్టిఫికెట్లు, పత్రాలను సూచించిన విధంగా సమర్పించాలి.

6. అప్లికేషన్ ఫీజు ఉంటే చెల్లించాలి.

7. దరఖాస్తును సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం కాపీని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 అక్టోబర్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2026

Notification Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *