DRDO Jobs Notification 2026: బీటెక్ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు….Apply Now :
DRDO Jobs Notification 2026: బీటెక్ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు….Apply NOW:
DRDO Jobs Notification 2026:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) నుంచి బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాలు.
ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO ) – ADA లో ఉద్యోగాలు
పోస్టు పేరు : అసిస్టెంట్
ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదికన
విద్య అర్హతలు :
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ పూర్తి చేసి ఉండాలి.
2. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయో పరిమితి:
1. అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి.
2. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
3. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అర్హత ఉన్న అభ్యర్థులు ఉచితంగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹31,000 వరకు జీతం అందుతుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉండవచ్చు.
ఎంపిక విధానం :
1. ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
2. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
3. ఇంటర్వ్యూలో అభ్యర్థుల విద్యార్హత, సంబంధిత నైపుణ్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. ఈ రిక్రూట్మెంట్కు ప్రత్యేకంగా ఆన్లైన్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
2. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16, ఆగస్టు 23 లేదా ఆగస్టు 30, 2026 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలి.
Notification & Application Form Pdf : Click Here
Official Website : Click Here