Central Govt Jobs

RBI Jobs : RBI జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2026 – పూర్తి వివరాలు | RBI Jobs 2026 Apply Online:

calendar_month April 20, 2026 person chitra

RBI Jobs : RBI జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2026 – పూర్తి వివరాలు | RBI Jobs 2026 Apply Online:

RBI Junior Engineer Recruitment 2026 :

నిరుద్యోగులకు శుభవార్త! Reserve Bank of India (RBI)లో జూనియర్ ఇంజనీర్ (Civil/Electrical) పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మంచి జీతంతో పాటు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Reserve Bank of Indiaలో జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్న వారు 16 ఏప్రిల్ 2026 నుండి 06 మే 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ (www.rbi.org.in )ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లో ఉద్యోగాలు

ఉద్యోగ విధానం: పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్

పోస్టుల వివరాలు : జూనియర్ ఇంజనీర్ (సివిల్ / ఎలక్ట్రికల్) పోస్టులు

మొత్తం పోస్టులు : 11

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జూనియర్ ఇంజనీర్ (Civil) :

1. సివిల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా (65% మార్కులు, SC/ST/PwBDలకు 55%) లేదా

2. సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ (55% మార్కులు, SC/ST/PwBDలకు 45%)

జూనియర్ ఇంజనీర్ (Electrical) :

1. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా (65% మార్కులు, SC/ST/PwBDలకు 55%) లేదా

2. ఎలక్ట్రికల్ లేదా EEEలో డిగ్రీ (55% మార్కులు, SC/ST/PwBDలకు 45%)

వయోపరిమితి :

1. 01 ఏప్రిల్ 2026 నాటికి 20 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

2. 02 ఏప్రిల్ 1996 కంటే ముందు & 01 ఏప్రిల్ 2006 తర్వాత పుట్టిన వారు అర్హులు కాదు.

3. రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. SC/ST/PwBD/EXS అభ్యర్థులకు : ₹50 + GST

2. General/OBC/EWS అభ్యర్థులకు : ₹450 + GST

3. చెల్లింపు విధానం: ఆన్‌లైన్

జీతం వివరాలు:

1. ప్రాథమిక వేతనం: ₹29,000/-

2. ప్రారంభ గ్రాస్ సాలరీ: సుమారు ₹91,309/- నెలకు జీతం ఇస్తారు.

3. అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు.

4. బ్యాంక్ వసతి లేకపోతే 15% HRA కూడా అందుతుంది.

ఎంపిక విధానం :

1. ఆన్‌లైన్ పరీక్ష (300 మార్కులు)

2. భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT) ద్వారా ఎంపిక చేస్తారు.

3. పరీక్ష తేదీ: 06 జూన్ 2026.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

2. “Junior Engineer Recruitment 2026” అనే లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించాలి.

3. డిజిలాకర్ సదుపాయం ద్వారా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవచ్చు.

4. ఇతర విధానాలు అంగీకరించబడవు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16 ఏప్రిల్ 2026

అప్లికేషన్ చివరి తేదీ: 06 మే 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Office Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *