రాత పరీక్ష లేకుండా 10th, 12th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు – తెలంగాణలో 15,982 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ విడుదల…..
రాత పరీక్ష లేకుండా 10th, 12th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు – తెలంగాణలో 15,982 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ విడుదల…..
తెలంగాణ అంగన్వాడి ఉద్యోగాలు 2026 – మొత్తం పోస్టుల వివరాలు :
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న సుమారు 15,982 పోస్టులను ఈ సంవత్సరంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా ఈ నియామక ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అంగన్వాడి హెల్పర్ పోస్టులు: 12,882, అంగన్వాడి టీచర్ పోస్టులు: 3,100 ఉన్నాయి.
మొదటి విడతలో సుమారు 5,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అందులో దాదాపు 3,000 టీచర్ పోస్టులు మరియు 2,000 హెల్పర్ పోస్టులు ఉండనున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
అంగన్వాడి హెల్పర్ పోస్టులు: 12,882
అంగన్వాడి టీచర్ పోస్టులు: 3,100
మొత్తం పోస్టులు : 15, 982
విద్య అర్హతలు :
1. హెల్పర్ పోస్టులకు: 10వ తరగతి
2. టీచర్ పోస్టులకు: ఇంటర్మీడియట్ (12th)
వయోపరిమితి :
1. కనిష్టంగా : 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
2. అర్హత గల అభ్యర్థులు స్థానిక మహిళలు అయి ఉండాలి.
3. వివాహిత మహిళలు మాత్రమే అప్లై చేయాలి.
రిజర్వేషన్ & ప్రాధాన్యత:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారు. అలాగే:
1. వితంతువులు
2. అనాధలు
3. దివ్యాంగులకు అదనపు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థుల ఎంపికలో:
1. విద్యార్హత మార్కులు
2. ఇంటర్వ్యూ పనితీరు
3. ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
ఎలా అప్లై చేయాలి?
1. అర్హులైన మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. అధికారిక వెబ్సైటు : https://mis.tgwdcw.in/
3. ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి.
రాష్ట్రంలో ఖాళీల పరిస్థితి :
ప్రస్తుతం తెలంగాణలో 35,781 అంగన్వాడి కేంద్రాలు ఉండగా, సుమారు 71,562 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర విభాగాలకు మార్పులు వలన సుమారు 22.33% ఖాళీలు ఏర్పడ్డాయి.
అభివృద్ధి పనులు:
ఈ సంవత్సరం అంగన్వాడి కేంద్రాల్లో పలు సదుపాయాలు కల్పిస్తున్నారు:
3,300 కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు
9,000 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం
7,700 కేంద్రాలకు మరుగుదొడ్లు
1,000 కేంద్రాలకు శాశ్వత భవనాలు
5,000 కేంద్రాల్లో LED స్క్రీన్లు
Notification Pdf Click Here
Official Website Click Here
Apply Link Click Here