Union Bank of India Apprentice Recruitment 2026 – 1865 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం… వెంటనే అప్లై చేసుకోండి!
Union Bank of India Apprentice Recruitment 2026 – 1865 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం… వెంటనే అప్లై చేసుకోండి!
Union Bank of India Apprentice Recruitment 2026:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2026 సంవత్సరానికి భారీ స్థాయిలో Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1865 ఖాళీలు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.
ఈ ట్రైనింగ్ ద్వారా అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో ప్రాక్టికల్ అనుభవాన్ని పొందగలరు. అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం, స్టైపెండ్ వంటి అన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Union Bank of India లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Apprentice పోస్టులు
ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ – 303
తెలంగాణ – 164
ఉత్తరప్రదేశ్ – 335
మహారాష్ట్ర – 196
కర్ణాటక – 131
మొత్తం పోస్టులు : 1865
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ
2. 01-04-2026 నాటికి అర్హత ఉండాలి.
3. గ్రాడ్యుయేషన్ పూర్తయి 4 సంవత్సరాల లోపు ఉండాలి.
4. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి.
వయో పరిమితి :
కనిష్టం: 20 సంవత్సరాలు, గరిష్టం: 28 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపులు:
1. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
3. PwBD – 10–15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC Male – ₹944
2. General / OBC Female – ₹708
3. SC / ST / PwBD – ₹236 ఫీజు చెల్లించాలి.
4. ఫీజు రీఫండ్ చేయబడదు.
స్టైపెండ్ వివరాలు :
1. గ్రామీణ / సెమీ అర్బన్ – ₹15,000
2. అర్బన్ – ₹18,000
3. మెట్రో – ₹20,000
4. ఇతర అలవెన్సులు ఇవ్వబడవు.
ఎంపిక విధానం :
1. ఆన్లైన్ పరీక్ష
2. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ట్రైనింగ్ వివరాలు :
1. ట్రైనింగ్ వ్యవధి: 1 సంవత్సరం
2. బ్యాంక్ బ్రాంచ్‌లలో On-the-job training
3. నెలకు 1 Casual Leave
4. ఉద్యోగం గ్యారంటీ లేదు.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. NATS / NAPS పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి.
3. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
4. ఫీజు చెల్లించాలి.
5. హార్డ్ కాపీలు పంపాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 19 మే 2026
పరీక్ష తేదీ: మే / జూన్ 2026