Information

AP Inter Results 2026 Date – విడుదల తేదీ, చెక్ చేసే విధానం పూర్తి వివరాలు:

calendar_month April 13, 2026 person chitra

AP Inter Results 2026 Date – విడుదల తేదీ, చెక్ చేసే విధానం పూర్తి వివరాలు:

ఫలితాల విడుదల తేదీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించిన మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 19, 2026న విడుదల చేసే అవకాశముందని ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో, ఏపీ విద్యార్థులు కూడా తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అలాగే మార్కులను టెక్నాలజీ సహాయంతో ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి తప్పులు లేకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

Inter Results 2026 విడుదలపై తాజా సమాచారం:

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫలితాల విడుదలకు సంబంధించిన తుది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫలితాలను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉంది.

అదే సమయంలో, సప్లిమెంటరీ పరీక్షలను మే నెలలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

3 మార్గాల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు:

విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మూడు విధాలుగా సులభంగా తెలుసుకోవచ్చు:

1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా

2. వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. SMS ద్వారా

వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్‌పేజ్‌లో “AP Inter Results 2026” అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.

4. Submit పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

5. సబ్జెక్ట్ వారీగా మార్కులు చూసుకుని మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్యమైన సూచనలు:

1. ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్ స్లో అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి.

2. మీ హాల్ టికెట్ నెంబర్ తప్పకుండా సరిగ్గా నమోదు చేయండి.

3. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఫలితాలు చెక్ చేయండి.

AP Inter Results 2026 : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *