MJPTBCWREIS Sweepers Recruitment 2026: సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండి.
MJPTBCWREIS Sweepers Recruitment 2026: సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండి.
MJPTBCWREIS Sweepers Recruitment 2026:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. జనగాం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) పరిధిలో స్వీపర్లు, స్కావెంజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమెతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : MJPTBCWREIS ఉద్యోగాలు
జిల్లా : జనగాం
పోస్టుల పేర్లు : స్వీపర్, స్కావెంజర్
మొత్తం ఖాళీలు : 05
ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్వీపర్లు (Sweepers): 02 పోస్టులు
స్కావెంజర్లు (Scavengers): 03 పోస్టులు
విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 7వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి కేటగిరీకి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం మెరిట్ జాబితాను వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.
రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకురావాలి.
దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికేట్లు :
దరఖాస్తు ఫారంతో పాటు కింది ధృవీకరణ పత్రాల స్వీయ ధృవీకరించిన (Self Attested) జిరాక్స్ కాపీలను జతచేయాలి.
1.సంబంధిత తహశీల్దార్/MRO జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం.
2. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్లు.
3. ప్రైవేట్‌గా చదివిన అభ్యర్థులు సంబంధిత తహశీల్దార్/MRO నుంచి రెసిడెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలి.
4. రెజ్యూమె లేదా బయోడేటా ఫారంపై ఫోటోగ్రాఫ్ అతికించాలి.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమె/బయోడేటాతో పాటు అవసరమైన సర్టిఫికేట్ల కాపీలను సిద్ధం చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును జనగాం జిల్లా MJPTBCWREIS జిల్లా కోఆర్డినేటర్ సమన్వయంతో జిల్లా విద్యా కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. చివరి తేదీ 31 అక్టోబర్ 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు అందజేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 28 అక్టోబర్ 2026.
దరఖాస్తులకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2026.
దరఖాస్తు సమర్పించాల్సిన చివరి సమయం: సాయంత్రం 5:00 గంటలు.
రాత పరీక్ష తేదీ: 01 నవంబర్ 2026.
పరీక్ష సమయం: ఉదయం 11:00 గంటలు.
Notification Pdf Click Here
Application Pdf Click Here