కాకినాడ జాబ్ మేళా 2026: 1500 ఉద్యోగాలు, ప్రముఖ కంపెనీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ :
కాకినాడ జాబ్ మేళా 2026: 1500 ఉద్యోగాలు, ప్రముఖ కంపెనీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్:
కాకినాడ జాబ్ మేళా 2026 పూర్తి వివరాలు:
కాకినాడ జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రముఖ కంపెనీల్లో సుమారు 1,500 ఖాళీలతో ఈ భారీ జాబ్‌మేళా ద్వారా డైరెక్ట్ ఇంటర్వ్యూలతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.
కాకినాడ జిల్లాలోని SDVVL స్కిల్ హబ్‌లో ఏప్రిల్ 27, 2026న ఈ భారీ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్, సర్వీస్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ జాబ్‌మేళాలో మొత్తం 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. అభ్యర్థులకు సుమారు 1,500 ఉద్యోగాలను అందించనున్న ఈ అవకాశాన్ని అర్హులైన యువత తప్పకుండా వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
జాబ్ మేళా పాల్గొనే సంస్థలు & ఖాళీల వివరాలు:
ఈ జాబ్‌మేళాలో DBS Bank, KIA India, PhonePe, Apollo Pharmacy, SBI Life Insurance, Aurobindo Pharma వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 1,500కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి. సేల్స్, టెక్నికల్, కస్టమర్ సపోర్ట్, ఫార్మా, ఫైనాన్స్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
1. DBS Bank – 80
2. KIA India Pvt. Ltd. – 100
3.PhonePe Private Limited – 45
4. Renewsis India Pvt. Ltd. – 140
5.Premier Energies Pvt. Ltd. – 50
6. Shakthi Hanuman Enterprise – 120
7. Neuland Labs – 100
8. TeamLease – 30
9. LG Services Pvt. Ltd. – 10
10. Muthoot Finance Limited – 10
11. Dixon – 100
12. Apollo Pharmacy – 120
13.SBI Life Insurance – 240
14. Bank of Baroda – 50
15. Aurobindo Pharma Limited – 150
16. Deccan Fine Chemical India Pvt. Ltd. – 100
17. Varun Motors – 15
జాబ్‌మేళా వివరాలు:
స్థలం: SDVVL స్కిల్ హబ్, కాకినాడ జిల్లా
తేదీ: ఏప్రిల్ 27, 2026
సంప్రదించాల్సిన నెంబర్ : 9949156583
నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మీ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాన్ని పొందేందుకు ఈ జాబ్‌మేళాలో పాల్గొని మీ కెరీర్‌కు మంచి ప్రారంభం ఇవ్వండి.