ఎటువంటి ఫీజు లేకుండా 7వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు … వెంటనే దరఖాస్తు చేయండి! | AP Govt Polytechnic College APCOS Recruitment 2026 :
ఎటువంటి ఫీజు లేకుండా 7వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు … వెంటనే దరఖాస్తు చేయండి! | AP Govt Polytechnic College APCOS Recruitment 2026 :
AP Govt Polytechnic College APCOS Recruitment 2026 :
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లా నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను APCOS ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు 7వ తరగతి, ITI లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ నియామకాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. దరఖాస్తులను 08 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 వరకు ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నార్పల లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ అసిస్టెంట్
2. ల్యాబ్ అటెండర్
3. ఆఫీస్ సబార్డినేట్
మొత్తం ఖాళీలు : 08 పోస్టులు
ఉద్యోగ విధానం: అవుట్‌సోర్సింగ్ ఆధారిత నియామకం
విద్యార్హతలు:
జూనియర్ అసిస్టెంట్ :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ల్యాబ్ అటెండర్ :
సంబంధిత ట్రేడ్లలో ITI పాస్ చేసి ఉండాలి. అదనంగా 1 సంవత్సరం అనుభవం అవసరం.
లేదా
మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి అనుభవం కలిగి ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్:
7వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సైకిల్ తొక్కగలగాలి.
వయోపరిమితి :
27-03-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు:
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి రూ.15,000/- నుండి రూ.18,500/- వరకు జీతం అందించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ద్వారా నిర్వహిస్తారు:
1. అర్హతల పరిశీలన
2. సర్టిఫికేట్ వెరిఫికేషన్
3. రాత పరీక్ష
4. స్కిల్ టెస్ట్
5. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధృవపత్రాల జిరాక్స్ కాపీలతో కలిసి ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా:
ప్రిన్సిపాల్ గారి కార్యాలయం,
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల,
నార్పల, అనంతపురం జిల్లా.
దరఖాస్తులను ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరిస్తారు. చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులు పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 08 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 20 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Office Website Click Here