కేంద్ర ప్రభుత్వంలో 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.! CISF ASI Paramedical Staff Recruitment 2026 Apply Now :
కేంద్ర ప్రభుత్వంలో 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.! CISF ASI Paramedical Staff Recruitment 2026 Apply Now :
CISF ASI Paramedical Staff Recruitment 2026 :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) ASI పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ASI (Pharmacist), ASI (X-Ray Technician), ASI (Lab Technician) విభాగాల్లో మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన పురుషులు మరియు మహిళలు దేశవ్యాప్తంగా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹29,200 నుండి ₹92,300 వరకు వేతనం లభిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Central Industrial Security Force (CISF) లో ఉద్యోగాలు
పోస్టుల పేరు :
1. ASI Pharmacist – 18
2. ASI X-Ray Technician – 01
3. ASI Lab Technician – 05 పోస్టులు
మొత్తం ఖాళీలు : 24
ఉద్యోగ స్థలం : భారతదేశవ్యాప్తంగా
విద్య అర్హతలు :
ASI (Pharmacist) : 10+2 ఉత్తీర్ణతతో పాటు Pharmacy Diploma/Degree మరియు Pharmacy Council Registration
ASI (X-Ray Technician): 10+2 ఉత్తీర్ణత + Radiographyలో 2 సంవత్సరాల డిప్లొమా
ASI (Lab Technician) : 10+2 (Science) + Medical Laboratory Technologyలో 2 సంవత్సరాల డిప్లొమా
వయో పరిమితి :
1. దరఖాస్తుదారుల వయస్సు 07 జూలై 2026 నాటికి లెక్కించబడుతుంది.
2. అన్ని ASI పోస్టులకి 18 నుండి 28 సంవత్సరాలు ఉండాలి .
వయో సడలింపు:
1. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
2. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
3. ఇతర రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
శారీరక అర్హతలు (PST) :
పురుష అభ్యర్థులు :
1. General/OBC/EWS/SC – ఎత్తు 170 సెం.మీ , ఛాతి 80-85 సెం.మీ
ST – ఎత్తు 162.5 సెం.మీ , ఛాతి 77-82 సెం.మీ
మహిళా అభ్యర్థులు :
1. General/OBC/EWS/SC – ఎత్తు 157 సెం.మీ
ST అభ్యర్థులకు – ఎత్తు 154 సెం.మీ
దరఖాస్తు రుసుము :
1. UR/OBC/EWS – ₹100 /-
2. SC/ST/Ex-Servicemen – ఫీజు లేదు.
3. మహిళా అభ్యర్థులు- ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹29,200 – ₹92,300 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
CISF ASI పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2026లో ఎంపిక ప్రక్రియ పలు దశల్లో నిర్వహించబడుతుంది.
1. రాత పరీక్ష (OMR/CBT)
2.Physical Standard Test (PST)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. Basic Vocational Aptitude Test (BVAT)
5. మెడికల్ ఎగ్జామినేషన్ (DME/RME)
6. తుది మెరిట్ జాబితా
ఎలా దరఖాస్తు చేయాలి?
1. CISF అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
2. One-Time Registration (OTR) పూర్తి చేయాలి.
3. దరఖాస్తు ఫారాన్ని సరిగా నింపాలి.
4. ఫోటో, సంతకం మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
5. ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.
6. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 07 జులై 2026