10వ తరగతి అర్హతతో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 179 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… | CCRUM Recruitment 2026 Apply Now :
10వ తరగతి అర్హతతో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 179 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… | CCRUM Recruitment 2026 Apply Now :
CCRUM Recruitment 2026 :
నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఉనాని మెడిసిన్ (CCRUM) శుభవార్త అందించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లో మొత్తం 179 ఖాళీల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూలై 2026 నుంచి 31 జూలై 2026 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఉనాని మెడిసిన్ (CCRUM) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), స్టాఫ్ కార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తదితర పోస్టులు
మొత్తం పోస్టులు : 179
విద్య అర్హతలు :
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి :
1. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతభత్యాలు అందించబడతాయి.
ఎంపిక విధానం :
1. గ్రూప్-ఏ, గ్రూప్-బీ మరియు గ్రూప్-సీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించబడుతుంది.
2. గ్రూప్-ఏ పోస్టులకు CBT పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. CBTకు 70 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయిస్తారు.
3. గ్రూప్-బీ మరియు గ్రూప్-సీ పోస్టులకు 100 మార్కుల CBT పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
4. అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
5. MTS పోస్టులు మినహా, ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది.
6. తుది ఎంపికలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు CCRUM అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష షెడ్యూల్, అడ్మిట్ కార్డులు, ఫలితాలు, ఇంటర్వ్యూ వివరాలు మరియు ఇతర తాజా సమాచారం అధికారిక వెబ్సైట్లో మాత్రమే ప్రకటించబడుతుంది.
3. కాబట్టి అభ్యర్థులు వెబ్సైట్ను తరచూ పరిశీలిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించబడింది.
గమనిక: పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, రిజర్వేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 01 జూలై 2026
దరఖాస్తు చివరి తేదీ : 31 జూలై 2026
Notification Pdf Click Here
Official Website : Click Here