AP Inter Supplementary Exam Results 2026: జూన్ 18న ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల…
AP Inter Supplementary Exam Results 2026: జూన్ 18న ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల…
AP Inter Advanced Supplementary Results 2026 :
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురుచూస్తున్న AP Inter Supplementary Results 2026 జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. . జూన్ 5న పరీక్షలు ముగియగా, జూన్ 15తో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది.
మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన సుమారు 12.50 లక్షల జవాబు పత్రాల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, ఫలితాల ప్రాసెసింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యిన అనంతరం జూన్ 18న ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
EAPCET ఫలితాలు కూడా త్వరలో :
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాల విడుదల అనంతరం AP EAPCET 2026 ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ జోడించి EAPCET ఫలితాలను విడుదల చేయాల్సి ఉండటంతో ఫలితాల ప్రకటనలో కొంత ఆలస్యం చోటుచేసుకుంది.
AP Inter Supplementary Results 2026 ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు అధికారిక BIEAP వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలి. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మకుండా, అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా మాత్రమే తమ ఫలితాలను పరిశీలించడం సురక్షితం.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ విధంగా తెలుసుకోవచ్చు:
అధికారిక వెబ్సైట్ ద్వారా :
1. ముందుగా https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. హోమ్‌పేజీలో కనిపించే AP Inter Advanced Supplementary Results 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
3.హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
4. అనంతరం మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
5. WhatsApp ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న WhatsApp Governance Services ద్వారా కూడా ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు.
1. ముందుగా +91 95523 00009 నంబర్‌కు WhatsAppలో “Hi” అని మెసేజ్ పంపాలి.
2. వచ్చిన ఎంపికలలో Choice Services పై క్లిక్ చేయాలి.
3. అనంతరం Education Services ను ఎంచుకోవాలి.
4. అక్కడ కనిపించే Inter Advanced Supplementary Results ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసిన వెంటనే ఫలితాలు పొందవచ్చు.
ముఖ్య గమనిక:
AP Inter Supplementary Results 2026 జూన్ 18న విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లేదా WhatsApp సేవల ద్వారా తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.