AP Jobs

AP ఉద్యోగులకు గుడ్ న్యూస్ : BLOలు, సూపర్వైజర్లకు రూ.6,000 ప్రత్యేక ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ…

calendar_month July 16, 2026 person chitra

AP ఉద్యోగులకు గుడ్ న్యూస్ : BLOలు, సూపర్వైజర్లకు రూ.6,000 ప్రత్యేక ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ…

AP BLOలకు రూ.6000 ప్రోత్సాహకం – పూర్తి వివరాలు :

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ. ప్రతి ఓటరు వివరాలను ధృవీకరించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం, అర్హత లేని పేర్లను తొలగించడం వంటి బాధ్యతలను BLOలు, సూపర్వైజర్లు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో అదనపు సమయం కేటాయించి విధులు నిర్వర్తించిన సిబ్బంది సేవలను గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం AP BLOలకు రూ.6000 ప్రోత్సాహకం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) మరియు BLO సూపర్వైజర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) శుభవార్త తెలిపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.6,000 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. SIR ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషించిన BLOలు, సూపర్వైజర్ల సేవలను గుర్తిస్తూ ఈ వన్‌టైమ్ గౌరవ వేతనం (ప్రోత్సాహకం) అందజేయాలని నిర్ణయించారు.

ఎవరికీ ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో విధులు నిర్వహించిన BLOలు మరియు BLO సూపర్వైజర్లు ఈ ప్రత్యేక ప్రోత్సాహకానికి అర్హులు.

ఎంత మొత్తం అందుతుంది?

అర్హులైన ప్రతి BLO, సూపర్వైజర్‌కు రూ.6,000 చొప్పున ఒకేసారి ప్రత్యేక గౌరవ వేతనం చెల్లించనున్నారు.

డబ్బు ఎలా జమ అవుతుంది?

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు, సంబంధిత జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకుని అర్హులైన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6,000 జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించిన వేలాది మంది BLOలు, సూపర్వైజర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హుల ఖాతాల్లో ప్రోత్సాహక నగదు జమ కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *