Bank Jobs

గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం కోరుకునేవారికి PNBలో 545 పర్మనెంట్ పోస్టులు.. తెలుగు రావాలి .. | PNB Bank LBO Recruitment 2026 :

calendar_month July 21, 2026 person chitra

గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం కోరుకునేవారికి PNBలో 545 పర్మనెంట్ పోస్టులు.. తెలుగు రావాలి .. | PNB Bank LBO Recruitment 2026 :

PNB Bank Local Bank Officer (LBO) Recruitment 2026 :

ప్రభుత్వ రంగ బ్యాంకులో శాశ్వత ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శుభవార్త అందించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) Local Bank Officer (LBO) పోస్టుల భర్తీకి మొత్తం 545 ఖాళీలతో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ రంగ బ్యాంకులో శాశ్వత ఉద్యోగంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, పదోన్నతి అవకాశాలు మరియు భవిష్యత్తుకు భద్రమైన కెరీర్ లభించనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. స్థానిక భాషగా తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు 20 జూలై 2026 నుండి 09 ఆగస్టు 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

PNB Bank LBO Recruitment 2026 – ముఖ్యాంశాలు :

సంస్థ పేరు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో ఉద్యోగాలు

పోస్టు పేరు : Local Bank Officer (LBO)

మొత్తం ఖాళీలు : 545

ఉద్యోగ రకం : పర్మనెంట్ ఉద్యోగం

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు మరియు ఇతర అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

2. స్థానిక భాషగా తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడడం తప్పనిసరిగా రావాలి.

వయోపరిమితి :

1. 09 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు: కనీసం 20 సంవత్సరాలు , గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

SC / ST / PwBD అభ్యర్థులు రూ.50 + 18% GST , మొత్తం రూ.59/-

ఇతర అన్ని అభ్యర్థులు రూ.1000 + 18% GST మొత్తం రూ.1180/-

నెల జీతం :

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు: రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు వేతనం చెల్లించబడుతుంది.

2. అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది.

1. ఆన్‌లైన్ రాత పరీక్ష

2. Local Language Proficiency Test (LLPT)

3. వ్యక్తిగత ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. మెడికల్ ఫిట్‌నెస్ (అవసరమైతే)

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://pnb.bank.in ను సందర్శించాలి.

2. Careers / Recruitment విభాగంలోకి వెళ్లాలి.

3. PNB Local Bank Officer (LBO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఎంపిక చేయాలి.

4. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.

5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

6. దరఖాస్తు రుసుము చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయాలి.

7. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ: 09 ఆగస్టు 2026

ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికంగా): ఆగస్టు / సెప్టెంబర్ 2026

Notification Pdf Click Here 

Apply Online Link Click Here 

Office Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *