తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026: జీతం ఎంత? ఏజ్ లిమిట్ ఎంత? పూర్తి వివరాలు:
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026: జీతం ఎంత? ఏజ్ లిమిట్ ఎంత? పూర్తి వివరాలు:
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైలు శాఖల్లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Telangana police department లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 7,437 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో ముఖ్యమైనవి:
SI (సివిల్) – 148 పోస్టులు
కానిస్టేబుల్ (సివిల్) – 3,697 పోస్టులు
కానిస్టేబుల్ (ఆర్మ్డ్ రిజర్వ్) – 1,052 పోస్టులు
SPF కానిస్టేబుల్ – 1,380 పోస్టులు
SPF SI – 44 పోస్టులు
ఫైర్ ఫైటర్ – 751 పోస్టులు
మొత్తం పోస్టులు : 7, 437
వయోపరిమితి :
కానిస్టేబుల్ పోస్టులు :
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు
SI పోస్టులు :
కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో 897 ప్రకారం అన్ని అభ్యర్థులకు 5 సంవత్సరాల సాధారణ వయో సడలింపు వర్తిస్తుంది.
అదనంగా SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో సడలింపు కూడా ఉంటుంది.
దీంతో:
జనరల్ అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు 27 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు వయో సడలింపు వర్తించడంతో, వారు గరిష్టంగా 32 ఏళ్ల వయస్సు వరకు అర్హత పొందుతారు.
ఖచ్చితమైన వయోపరిమితి మరియు సడలింపులకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు.
| పోస్టు | నెల జీతం |
|---|---|
| కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్, కానిస్టేబుల్ డ్రైవర్ మెకానిక్ | రూ.24,280 – రూ.72,850 |
| అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) | రూ.33,750 – రూ.99,310 |
| సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) | రూ.42,300 – రూ.1,15,270 |
| సబ్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ | రూ.38,890 – రూ.1,12,510 |
పోస్టు, శాఖ మరియు సర్వీస్ నిబంధనలను బట్టి వేతనంతో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
అవసరమైన సర్టిఫికెట్లు :
తెలంగాణ పోలీస్ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ముఖ్యంగా:
1. విద్యార్హత సర్టిఫికెట్లు
2. అభ్యర్థులు 01 ఏప్రిల్ 2026 తర్వాత జారీ చేసిన, నోటిఫికేషన్‌లో సూచించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
3. BC, SC, ST అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం
4. స్థానిక అభ్యర్థుల కోసం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
5. ఇతర నోటిఫికేషన్‌లో సూచించిన పత్రాలు
ముఖ్యమైన సూచన :
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఫిజికల్ ప్రమాణాలు మరియు ఇతర అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది.
అధికారిక వెబ్‌సైట్: https://www.tgprb.in/