IBPS CSA Recruitment 2026: తెలుగు తెలిసిన వారికి బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు.. 11,403 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.
IBPS CSA Recruitment 2026: తెలుగు తెలిసిన వారికి బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు.. 11,403 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.
IBPS CSA Recruitment 2026:
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో Customer Service Associate (CSA) / Clerk పోస్టుల భర్తీకి CRP CSA-XVI Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు, తెలంగాణలో 191 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 01 ఆగస్టు 2026 నుండి 21 ఆగస్టు 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : Customer Service Associate (CSA) / Clerk పోస్టులు
ఖాళీల వివరాలు :
ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 11,403 Customer Service Associate (CSA) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ – 186 పోస్టులు
తెలంగాణ – 191 పోస్టులు
దేశవ్యాప్తంగా – 11,403 పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు : 11,403
ఉద్యోగ రకం : పర్మినెంట్
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
విద్యార్హతలు :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సమాన అర్హత కలిగిన విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలోని స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం మరియు పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలి.
3. కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ లేదా విద్యలో కంప్యూటర్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
వయోపరిమితి :
1. 01 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు: కనిష్ట వయస్సు – 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు – 28 సంవత్సరాలు
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :
1. SC / ST / PwBD / Ex-Servicemen – ₹175/-
2. OC / BC / EWS – ₹850/-
జీతం వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ పే స్కేల్ ప్రకారం జీతం అందుతుంది.
Pay Scale:
₹24,050 – ₹64,480 (ఇతర అలవెన్సులతో కలిపి నెలకు సుమారు ₹67,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది.)
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది.
1. ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష
2. మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్ష
3. స్థానిక భాష ప్రావీణ్యత పరీక్ష (LLPT) (అవసరమైతే)
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ను సందర్శించాలి.
2. CRP CSA-XVI నోటిఫికేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి.
3. “CLICK HERE TO APPLY ONLINE FOR CRP-Customer Service Associates (CSA-XVI)” పై క్లిక్ చేయాలి.
4. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
5. అవసరమైన వివరాలు నమోదు చేసి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
6. దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.
7. చివరగా అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01 ఆగస్టు 2026
దరఖాస్తు చివరి తేదీ: 21 ఆగస్టు 2026

Notification Pdf Click Here
Apply Online Link Click Here
Office Website Click Here