Postal GDS Notification 2026: ఎగ్జామ్ లేకుండా పోస్టాఫీసులో 23,757 ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హతతోనే అవకాశం!
Postal GDS Notification 2026: ఎగ్జామ్ లేకుండా పోస్టాఫీసులో 23,757 ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హతతోనే అవకాశం!
Postal GDS Notification 2026:
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియా పోస్ట్ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి GDS Online Engagement Schedule-II 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 23,757 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపిక ప్రక్రియ చేపడతారు. అందువల్ల పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలు
పోస్టు పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS)
మొత్తం ఖాళీలు : 23,757
పోస్టుల రకాలు : BPM, ABPM, Dak Sevak .రాష్ట్రాలు, సర్కిళ్లు, డివిజన్ల వారీగా ఖాళీలను కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నట్లు సమాచారం.
విద్య అర్హతలు :
GDS పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా 10వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అదనంగా:
1. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
2. సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.
3. సంబంధిత పోస్టుకు అవసరమైన స్థానిక భాషను చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వయోపరిమితి :
అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా ఫీజు వర్తిస్తుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సాధారణ కేటగిరీకి చెందిన అర్హత ఉన్న అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, OBC, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు వర్తించే నిబంధనలు ఉండవచ్చు.
జీతం వివరాలు :
GDS పోస్టులకు పోస్టు ఆధారంగా TRCA (Time Related Continuity Allowance) విధానంలో వేతనం అందుతుంది.
1. BPM: రూ.12,000 నుంచి రూ.29,380 వరకు
2. ABPM / Dak Sevak: రూ.10,000 నుంచి రూ.24,470 వరకు
3. ఇతర నిబంధనల ప్రకారం అదనపు ప్రయోజనాలు కూడా వర్తించవచ్చు.
ఎంపిక విధానం :
ఈ రిక్రూట్‌మెంట్‌లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం రాత పరీక్ష లేకపోవడం. అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చు. అనంతరం సంబంధిత డివిజన్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
అవసరమైన పత్రాలు :
డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సాధారణంగా కింది పత్రాలు అవసరం కావచ్చు:
10వ తరగతి మార్కుల మెమో
పుట్టిన తేదీ రుజువు
ఆధార్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు
కుల ధ్రువీకరణ పత్రం, అవసరమైతే
EWS సర్టిఫికెట్, వర్తిస్తే
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అభ్యర్థి సంతకం
ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా GDS రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అవసరమైన వివరాలు నమోదు చేసి, పత్రాలను సమర్పించి, వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
ఆ తర్వాత https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అభ్యర్థులు 21 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే 23 నుంచి 24 సెప్టెంబర్ 2026 వరకు అందుబాటులో ఉండే సవరణ (Correction) విండో ద్వారా అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
Notification Pdf Click Here
Apply Link Click Here