10th, ITI, డిప్లొమా అర్హతతో ISROలో ఉద్యోగాలు.. 22 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ISRO IPRC Recruitment 2026 :
10th, ITI, డిప్లొమా అర్హతతో ISROలో ఉద్యోగాలు.. 22 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ISRO IPRC Recruitment 2026 :
ISRO IPRC Recruitment 2026 :
నిరుద్యోగ అభ్యర్థులకు ఇస్రో నుంచి అదిరిపోయే ఉద్యోగ అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC), మహేంద్రగిరిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’, టెక్నీషియన్, కుక్ ‘ఎ’, ఫైర్‌మ్యాన్ ‘ఎ’ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం 22 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విద్యార్హత పోస్టును బట్టి 10వ తరగతి, ITI, డిప్లొమాగా ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు 15 సెప్టెంబర్ 2026 నుంచి 5 అక్టోబర్ 2026 సాయంత్రం 4:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ISRO Propulsion Complex (IPRC), Mahendragiri లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Technical Assistant, Technician ‘B’, Technician, Cook ‘A’, Fireman ‘A’
మొత్తం ఖాళీలు : 22
ఉద్యోగ విధానం : పర్మినెంట్
విద్యార్హతలు :
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు సంబంధిత పోస్టుకు నిర్దేశించిన అర్హతను కలిగి ఉండాలి.
10వ తరగతి అర్హతతో:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి SSLC/SSC/మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పోస్టుకు అవసరమైన శారీరక దృఢత్వ ప్రమాణాలను కలిగి ఉండాలి.
ITI అర్హతతో:
10వ తరగతితో పాటు Fitter, Electrician, Welder, Refrigeration & Air Conditioning, Machinist వంటి సంబంధిత ట్రేడుల్లో ITI అర్హత, అలాగే NCVT నుంచి NTC/NAC ఉండాలి.
డిప్లొమా అర్హతతో:
పోస్టును బట్టి Automobile Engineering, Mechanical Engineering, Production Engineering, Electronics Engineering, Electronics & Communication Engineering, Electronics & Telecommunication Engineering లేదా Electronics & Instrumentation Engineeringలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా అవసరం.
వయోపరిమితి :
1. 5 అక్టోబర్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
3. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
పోస్టు కోడ్‌ను బట్టి అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
పోస్ట్ కోడ్ 60 నుంచి 62 వరకు: ₹750 /-
పోస్ట్ కోడ్ 63 నుంచి 68, 70 నుంచి 71 వరకు: ₹500 /-
మహిళలు, SC, ST, మాజీ సైనికులు (Ex-Servicemen), PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లించిన దరఖాస్తు రుసుము పూర్తిగా వాపసు చేయబడుతుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.
టెక్నికల్ అసిస్టెంట్: ₹44,900 – ₹1,42,400/-
టెక్నీషియన్ ‘బి’: ₹21,700 – ₹69,100/-
కుక్ ‘ఎ’ & ఫైర్‌మ్యాన్ ‘ఎ’: ₹19,900 – ₹63,200/-
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల ద్వారా జరుగుతుంది.
1. రాత పరీక్ష
2. నైపుణ్య పరీక్ష / శారీరక సామర్థ్య పరీక్ష
3. వివరణాత్మక వైద్య పరీక్ష
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు ISRO IPRC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Careers విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, పోస్టుకు సంబంధించిన విద్యార్హత, వయస్సు, ఫీజు, ఇతర నిబంధనలను నిర్ధారించుకోవాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్: https://www.iprc.gov.in/careers.html
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 15 సెప్టెంబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 5 అక్టోబర్ 2026.
Full Notification Pdf Click Here
Apply Online Link Click Here
Official Website Click Here