టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. అప్లై చేశారా? India Post GDS 2026 Recruitment Apply Online విధానం ఇదే..!
టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. అప్లై చేశారా? India Post GDS 2026 Recruitment Apply Online విధానం ఇదే..!
India Post GDS Recruitment 2026:
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందే అవకాశం అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా టెన్త్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రధానంగా కింది పోస్టులను భర్తీ చేస్తున్నారు.
1. గ్రామీణ డాక్ సేవక్ (GDS)
2. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)
3. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)
ఈ ఉద్యోగాలకు ఎంపిక పదో తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అంటే అభ్యర్థులకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు.
మొత్తం పోస్టులు :
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 917 పోస్టులు, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హతలు :
1. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. స్థానిక భాషపై కూడా ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
వయో పరిమితి :
1. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS పురుషులకు: ₹100/-
2. మహిళలకు ఎస్సీ ఎస్టీ విద్యవ్యాంగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించావల్సిన అవసరం లేదు.
India Post GDS 2026 Apply Online – దరఖాస్తు విధానం :
1. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి:
ముందుగా ఇండియా పోస్ట్ GDS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
Website: https://www.indiapost.gov.in/gdsonlineengagement
2. రిజిస్ట్రేషన్ చేసుకోండి:
వెబ్‌సైట్‌లో “Click Here to Register” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్తగా దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు “New Candidate Registration” పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేసి Next పై క్లిక్ చేయాలి.
3. OTPతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి:
మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం అడిగిన వ్యక్తిగత, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత User ID, Password క్రియేట్ అవుతాయి.
4. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి:
ఇప్పుడు మీ User ID, Password ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, అవసరమైన పోస్టల్ సర్కిల్, పోస్టు ప్రాధాన్యత తదితర వివరాలను ఎంపిక చేయాలి.
చివరగా నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి Application Formను Submit చేయాలి. దరఖాస్తు ప్రక్రియను మొబైల్ ఫోన్ ద్వారానే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవడం మంచిది.
దరఖాస్తు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2026