AP EAPCET 2026 Registration: AP EAPCETదరఖాస్తులు ప్రారంభం – ముఖ్య తేదీలు, ఫీజు & అప్లై విధానం…. ఇలా చెక్ చేసుకోండి?
AP EAPCET 2026 Registration: AP EAPCETదరఖాస్తులు ప్రారంభం – ముఖ్య తేదీలు, ఫీజు & అప్లై విధానం…. ఇలా చెక్ చేసుకోండి?
AP EAPCET 2026 Registration:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ప్రముఖ ప్రవేశ పరీక్ష AP EAPCET 2026 (Andhra Pradesh Engineering, Agriculture and Pharmacy Common Entrance Test). ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 సంవత్సరానికి అధికారికంగా ప్రారంభమైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన అవకాశం. ఈ నేపథ్యంలో AP EAPCET 2026 దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, ఫీజు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్య తేదీలు, ఫీజు & అప్లై విధానం:
OC అభ్యర్థులకు రూ 800/- , BC అభ్యర్థులకు రూ 750/- , SC /ST అభ్యర్థులకు రూ 700/- ఫీజు చెల్లించాలి..
1. AP EAPCET ఆసక్తి గల విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం 7 మార్చ్ 2026 వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు.
2. రూ 1,000/- ఆలస్య రుసుము తో మార్చ్ 12 వరకు
3. రూ 2, 000/- ఆలస్య రుసుము తో మార్చ్ 17 వరకు
4. రూ 4,000/- ఆలస్య రుసుము తో మార్చ్ 21 వరకు
5. రూ 10,000/- ఆలస్య రుసుము తో మార్చ్ 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
దరఖాస్తు తర్వాత అనంతరం తప్పుల సవరణ కు మార్చ్ 26 నుంచి 28 వరకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 28 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14,15,18 తేదీలలో జరుగుతాయి. ఇంకా వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19,20 తేదీలలో ఆన్లైన్ విధానం లో నిర్వహిస్తారు. తర్వాత మే 23 న ప్రాథమిక ” కీ ” విడుదల అవుతుంది.
ఆన్సర్ ” కీ ” పై అభ్యంతరాలను మే 25 వ తేదీ వరకు స్వీకరిస్తారు. అనంతరం తుది ఆన్సర్ రూపొందించి AP EAPCET ఫలితాలు జూన్ 1 వ తేదీన ప్రకటించారు. ఈ ఏడాది కూడా JNTU కాకినాడ ఆధ్వర్యం లోనే EAPCET పరీక్షలు జరగనున్నాయి.
AP ECET 2026 పరీక్ష షెడ్యూల్ :
ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే AP EAPCET దరఖాస్తు ప్రక్రియ కూడా మార్చ్ 2 వ తేదీతో ముగుస్తుంది. ఆలస్య రుసుము తో 18 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో వస్తాయి. ఏప్రిల్ 23న రాష్ట్ర వ్యాప్తం గా పలు పరీక్ష కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ” కీ ” ని ఏప్రిల్ 27 న విడుదల చేసి మే 7 న ఫలితాలు ప్రకటిస్తారు.
AP EAPCET 2026 అప్లై చేసే విధానం:
1. AP EAPCET 2026 దరఖాస్తును ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.
2. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
3. “ Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
4. ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించండి.
5. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
6. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేయండి.
7. ఫోటో & సంతకం అప్లోడ్ చేయండి.
8. ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now