Admit Cards

TS Inter 2nd Year Hall Tickets OUT 2026 – ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి?

calendar_month February 19, 2026 person chitra

TS Inter 2nd Year Hall Tickets OUT 2026 – ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి?

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. Telangana State Board of Intermediate Education (TSBIE) 2026 పరీక్షలకు సంబంధించిన 2వ సంవత్సరం హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు హాల్ టికెట్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఫిబ్రవరి 18 మధ్యాహ్నం హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Inter 2nd Year 2026 Hall Tickets Release Date:

TS ఇంటర్ 2వ సంవత్సరం 2026 హాల్ టికెట్లు ఫిబ్రవరి 18, 2026న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌ను యాక్టివేట్ చేసి, విద్యార్థులు లేదా కాలేజ్ యాజమాన్యం ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసే విధానాలు:

విద్యార్థులు మూడు విధాలుగా హాల్ టికెట్లను పొందవచ్చు:

1. అధికారిక ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా

2.కాలేజ్ లాగిన్ ద్వారా

3.వాట్సాప్ సర్వీస్ ద్వారా

TS Inter 2nd Year Hall Tickets 2026 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ :

1. ముందుగా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2.హోమ్ పేజీలో “Telangana Intermediate 2nd Year 2026 Hall Tickets Download” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3.మీ రోల్ నెంబర్ లేదా 1వ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి.

4. “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.

5.వెంటనే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

6.అందులో ఉన్న పేరు, ఫోటో, సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయండి.

7. చివరగా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS Inter 2nd Year Hall Tickets : Download

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *