AP Jobs

10th అర్హతతో పరీక్ష లేకుండా ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో జాబ్స్ | AP Women Development Dept Notification 2026 Apply Now :

calendar_month March 7, 2026 person chitra

10th అర్హతతో పరీక్ష లేకుండా ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో జాబ్స్ | AP Women Development Dept Notification 2026 Apply Now :

AP WDCW Notification 2026 :

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW), పోలవరం జిల్లా నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాల్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, మల్టీ పర్పస్ స్టాఫ్, సోషల్ కౌన్సిలర్, పారామెడికల్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి.

10వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు చూసి గడువులోపు దరఖాస్తు చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పోలవరం జిల్లా లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్,

2. కేస్ వర్కర్,

3. ఆఫీస్ అసిస్టెంట్,

4. సెక్యూరిటీ గార్డ్,

5. మల్టీ పర్పస్ స్టాఫ్,

6. సోషల్ కౌన్సిలర్,

7. పారామెడికల్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 13

విద్య అర్హతలు:

1. 10వ తరగతి, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

2. సంబంధిత విభాగంలో 2 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయస్సు పరిమితి:

1. అభ్యర్థులకు కనీస వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

3. OBC / EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

2. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం వివరాలు:

1. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు ₹13,000 నుండి ₹34,000 వరకు జీతం అందుతుంది.

2. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు కావడంతో ఇతర అలవెన్సులు లేదా అదనపు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:

1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పంపించాలి.

2. రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

3. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

4. అవసరమైతే మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హతలు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలు నింపి గడువులోపు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 16 మార్చి 2026

Notification & Application Form : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *