రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేవలం 5th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP District Collector Office Recruitment 2026 Full Details :
రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేవలం 5th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP District Collector Office Recruitment 2026 Full Details :
AP District Collector Office Recruitment 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం వచ్చింది. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా, ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, మెటర్నిటీ అసిస్టెంట్, మెసెంజర్, ఆఫీస్ సబార్డినేట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, పీహెచ్ వర్కర్ మరియు క్లీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యంగా ఈ ఉద్యోగాలు విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) కోసం రిజర్వ్ చేసిన బ్యాక్‌లాగ్ పోస్టులు కావడం గమనించాల్సిన విషయం. మొత్తం 38 ఖాళీలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి.
అదనంగా, ఈ నియామకానికి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ 07 మార్చి 2026 నుండి ప్రారంభమైంది. అలాగే, అభ్యర్థులు తమ దరఖాస్తులను 30 మార్చి 2026 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ కార్యాలయం, కృష్ణా జిల్లా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ అసిస్టెంట్,
2. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్,
3. జూనియర్ ఆడిటర్,
4. మెటర్నిటీ అసిస్టెంట్,
5. మెసెంజర్,
6. ఆఫీస్ సబార్డినేట్,
7. సానిటరీ మేస్త్రి,
8. హెల్పర్,
9. పీహెచ్ వర్కర్,
10. క్లీనర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 38
ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ / బ్యాక్‌లాగ్ పోస్టులు
విద్య అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్ / జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ / జూనియర్ ఆడిటర్:
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. అలాగే కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ పరిజ్ఞానం ఉండాలి.
మెటర్నిటీ అసిస్టెంట్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ANM కోర్సు పూర్తి చేసి ఉండాలి.
మెసెంజర్, ఆఫీస్ సబార్డినేట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, PH వర్కర్, క్లీనర్:
5వ లేదా 7వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది.
వయస్సు పరిమితి:
కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 01-07-2026 నాటికి 52 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్‌కు అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹15,000 నుండి ₹38,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:
1. సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక.
2. కొంతమంది పోస్టులకు Office Automation with Computer Test ఉండవచ్చు.
3. మెరిట్ సమానంగా వచ్చినప్పుడు అధిక అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును క్రింది చిరునామాకు పంపాలి:
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,
కలెక్టర్ కార్యాలయం ఆవరణము,
చిలకలపూడి, మచిలీపట్నం.
దరఖాస్తును స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపించవచ్చు.
జత చేయవలసిన పత్రాలు:
దరఖాస్తుతో పాటు క్రింది పత్రాలు జత చేయాలి:
1. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
2. దివ్యాంగ ధృవీకరణ పత్రం
3. విద్యార్హత సర్టిఫికెట్లు
4.ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్
5. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
6. కుల ధృవీకరణ పత్రం
7. నివాస ధృవీకరణ పత్రం
8. రేషన్ కార్డ్
9. ఆధార్ కార్డ్
10.పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
Note : అవసరమైన ధృవపత్రాలు జత చేయని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07 మార్చ్ 2026
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30 మార్చ్ 2026
Notification & Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now