AP KGBV Admissions 2026 : 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష లేకుండా KGBV అడ్మిషన్లు ప్రారంభం ….
AP KGBV Admissions 2026 : 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష లేకుండా KGBV అడ్మిషన్లు ప్రారంభం ….
AP KGBV Admissions 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) లో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు KGBV ప్రిన్సిపాళ్లు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ అడ్మిషన్ల ద్వారా ముఖ్యంగా 6వ తరగతి ప్రవేశాలు, అలాగే 7వ తరగతి ఖాళీ సీట్లు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీట్లను భర్తీ చేయనున్నారు. విద్యార్థినులు మార్చి 12, 2026 నుంచి ఏప్రిల్ 01, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా SC, ST, BC, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థినులు, అనాధ బాలికలు, స్కూల్ డ్రాప్ అవుట్ విద్యార్థులు మరియు పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఎంట్రన్స్ పరీక్ష లేకుండా KGBV అడ్మిషన్లు:
ఈ ప్రవేశాలకు ఎటువంటి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించరు. విద్యార్థినుల ఎంపికను వారి రిజర్వేషన్ కేటగిరీ మరియు సమర్పించిన సర్టిఫికెట్ల ఆధారంగా చేస్తారు.
ఎంపికైన విద్యార్థినులకు KGBV పాఠశాలల్లో ప్రభుత్వం ద్వారా క్రింది సౌకర్యాలు అందించబడతాయి.
1. ఉచిత విద్య
2. ఉచిత భోజనం
3. వసతి (హాస్టల్ సౌకర్యం)
4. పాఠ్య పుస్తకాలు మరియు ఇతర అవసరమైన సదుపాయాలు
KGBV Admissions 2026 అర్హతలు:
కింద పేర్కొన్న వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
1. అనాధ బాలికలు
2. బడి బయట ఉన్న పిల్లలు
3. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు
4. పేద కుటుంబాలకు చెందిన బాలికలు
5. SC / ST / BC / మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు
6. BPL కుటుంబాలకు చెందిన విద్యార్థులు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 12 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ : 01 ఏప్రిల్ 2026
మెరిట్ జాబితా విడుదల : 13 ఏప్రిల్ 2026
డాక్యుమెంట్ వెరిఫికేషన్ : 13 – 17 ఏప్రిల్ 2026
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now