AP Jobs

12వ తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు – తెలుగు తెలిసిన వారికి మంచి అవకాశం… వెంటనే అప్లై చేసుకోండి . | AAICLAS Assistant (Security) Recruitment 2026 :

calendar_month June 7, 2026 person chitra

12వ తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు – తెలుగు తెలిసిన వారికి మంచి అవకాశం… వెంటనే అప్లై చేసుకోండి . | AAICLAS Assistant (Security) Recruitment 2026 :

AICLAS Assistant (Security) Recruitment 2026 :

ఏవియేషన్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుంచి అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్మీడియట్ (12వ తరగతి) అర్హత కలిగి, తెలుగు సహా స్థానిక భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రారంభంలో 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం కల్పిస్తారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్ సహా పలు విమానాశ్రయాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AAI Cargo Logistics & Allied Services Company Limited (AAICLAS) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులు

ఉద్యోగ విధానం: 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదిక

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

2. జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు ఉంటే సరిపోతుంది.

4. ఇంగ్లీష్, హిందీ చదవడం లేదా మాట్లాడడం రావాలి.

5. స్థానిక భాష (తెలుగు)పై అవగాహన ఉండటం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.

వయోపరిమితి :

01 జూన్ 2026 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / ఓబీసీ అభ్యర్థులు: రూ.500 /-

2. ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులు: రూ.100/-

3. ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ లేదా ఇతర ఆన్‌లైన్ విధానాల ద్వారా చెల్లించవచ్చు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500 నుంచి రూ.22,500 వరకు జీతం అందజేస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు AAICLAS అధికారిక వెబ్‌సైట్‌లోని “Career” విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. పోస్టుల సంఖ్య, అర్హతలు లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే అవి అధికారిక వెబ్‌సైట్‌లోనే ప్రకటించబడతాయి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 జూన్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ: 02 జూలై 2026

Notification Pdf Click Here

Official Website Click Here

Online Apply Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *