AP DCHS Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆసుపత్రుల్లో కొత్త ఉద్యోగాల భర్తీ – 10వ తరగతి నుండి డిగ్రీ అర్హతతో అవకాశం!
AP DCHS Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆసుపత్రుల్లో కొత్త ఉద్యోగాల భర్తీ – 10వ తరగతి నుండి డిగ్రీ అర్హతతో అవకాశం!
AP DCHS Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి (DCHS) కార్యాలయం వివిధ ఖాళీ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండర్ (GDA), MNO/FNO, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను తెలుసుకొని నిర్ణీత గడువులోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి (DCHS) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
ల్యాబ్ టెక్నీషియన్
ఎలక్ట్రీషియన్
డార్క్ రూమ్ అసిస్టెంట్ (DRA)
థియేటర్ అసిస్టెంట్
ల్యాబ్ అటెండర్
జనరల్ డ్యూటీ అటెండర్ (GDA)
పోస్టుమార్టం అసిస్టెంట్
MNO / FNO పోస్టులు
విద్యార్హతలు :
పోస్టును బట్టి కింది విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి
ఇంటర్మీడియట్
డిగ్రీ
B.Sc (MLT)
ఇతర సంబంధిత అర్హతలు
అనుభవం లేకున్నా కూడా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వయోపరిమితి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
వయస్సులో సడలింపు :
BC / SC / ST / EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
1. OC అభ్యర్థులు: ₹350 /-
2. BC / SC / ST / EWS మరియు ఇతర అభ్యర్థులు: ₹250/-
ఎంపిక విధానం :
1. ఈ నియామకాల్లో రాత పరీక్ష నిర్వహించరు.
2. అభ్యర్థుల ఎంపికను కేవలం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు
సర్టిఫికెట్ల పరిశీలన
నోటిఫికేషన్లో పేర్కొన్న ఎంపిక ప్రమాణాల ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, దరఖాస్తు ఫారాన్ని సరిగా నింపి అవసరమైన పత్రాలను జతచేసి 06 జూలై 2026లోపు ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 22 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ: 06 జూలై 2026
Notification & Application PDF : Click Here
Official Website : Click Here