AP Sadaram Slots Booking 2026: నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. కొత్త జోనల్ నిబంధనలు అమల్లోకి…
AP Sadaram Slots Booking 2026: నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. కొత్త జోనల్ నిబంధనలు అమల్లోకి…
AP Sadaram Slots Booking 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరం (SADAREM) సేవలను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు కొత్త జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నూతన నిబంధనల ప్రకారం సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఇకపై జోన్ల వారీగా నిర్వహించనుంది.. జూలై 8 నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూలై 13 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ (Screening) నిర్వహించనున్నారు.
ఈసారి సదరం సేవల్లో పలు కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటిని ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
AP Sadaram Slots Booking 2026 ముఖ్యాంశాలు :
1. జూలై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.
2. జూలై 13 నుంచి ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు.
3. కొత్తగా 6 జోన్ల విధానం అమలు.
4. సొంత జిల్లా లేదా సంబంధిత జోన్‌లోని సమీప జిల్లాలో మాత్రమే స్క్రీనింగ్ అవకాశం.
5. స్లాట్ బుకింగ్ సమయంలో Self Declaration Form తప్పనిసరి.
6. తొలి వైకల్య నిర్ధారణ ఫలితంపై అసంతృప్తి ఉంటే అదనంగా రెండు సార్లు మాత్రమే అప్పీల్ చేసుకునే అవకాశం.
కొత్త జోనల్ విధానంలో ఏమి మారింది?
ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ జిల్లా ఆస్పత్రిలోనైనా సదరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై దరఖాస్తుదారులు తమ సొంత జిల్లా లేదా సంబంధిత జోన్‌లోని సమీప జిల్లాలో మాత్రమే సదరం స్క్రీనింగ్‌కు హాజరుకావాలి. ఇతర జోన్లలో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు.
సదరం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
దరఖాస్తుదారులు ఈ క్రింది మార్గాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
1. AP Seva Portalలో Citizen Login ద్వారా.
2. సమీప గ్రామ/వార్డు సచివాలయం ద్వారా.
3. Mana Mitra WhatsApp సేవ (9552300009) ద్వారా కూడా స్లాట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది.
స్లాట్ బుకింగ్‌కు అవసరమైన పత్రాలు :
సదరం స్లాట్ నమోదు సమయంలో ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
1. ఆధార్ కార్డు
2. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్
3. పూర్తిగా నింపిన Self Declaration Form
AP Sadaram 6 జోన్లలో జిల్లాల వివరాలు :
జోన్ – 1 :
శ్రీకాకుళం
పార్వతీపురం మన్యం
విజయనగరం
విశాఖపట్నం
జోన్ – 2 :
అల్లూరి సీతారామరాజు
కాకినాడ
తూర్పు గోదావరి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
జోన్ – 3 :
పశ్చిమ గోదావరి
ఎన్టీఆర్
ఏలూరు
కృష్ణా
పోలవరం ప్రాంతం
జోన్ – 4 :
గుంటూరు
పల్నాడు
బాపట్ల
మార్కాపురం
ప్రకాశం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్ – 5 :
తిరుపతి
అన్నమయ్య
చిత్తూరు
వైఎస్సార్ కడప
జోన్ – 6 :
నంద్యాల
కర్నూలు
అనంతపురం
శ్రీ సత్యసాయి
అప్పీల్ ప్రక్రియ
వైకల్య నిర్ధారణ పరీక్ష అనంతరం వచ్చిన ఫలితంపై అభ్యర్థి అసంతృప్తిగా ఉంటే, కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా రెండు సార్లు మాత్రమే అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్య గమనిక :
సదరం స్లాట్ బుకింగ్ నేటి (జూలై 8) నుంచి ప్రారంభమవుతోంది. స్లాట్ బుక్ చేసుకునే ముందు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ మరియు పూర్తిగా నింపిన Self Declaration Form సిద్ధంగా ఉంచుకోవాలి. కొత్త జోనల్ విధానం ప్రకారం మాత్రమే స్క్రీనింగ్ నిర్వహించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Self or Doctor Declation Form Click Here