AP Government Jobs 2026: 10వ తరగతి అర్హతతో ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు – రాత పరీక్ష లేదు.. వెంటనే దరఖాస్తు చేయండి!
AP Government Jobs 2026: 10వ తరగతి అర్హతతో ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు – రాత పరీక్ష లేదు.. వెంటనే దరఖాస్తు చేయండి!
AP Secondary Health Hospital Outsourcing Recruitment 2026 :
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకాల మేరకు పల్నాడు జిల్లాలోని ప్రాంతీయ వైద్యశాలలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహాయక సిబ్బంది పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
ఈ నియామకాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పల్నాడు పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు 01 జూలై 2026 నుండి 07 జూలై 2026 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
క్రింది అవుట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant)
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (Operation Theatre Assistant)
జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA)
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (MNO)
ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO)
పోస్ట్‌మార్టం అసిస్టెంట్
ఆఫీస్ సబార్డినేట్

విద్యార్హతలు ;
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ :
గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్ :
1. SSC/10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు
2. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా
3. ఇంటర్మీడియట్ (వొకేషనల్ – ల్యాబ్ అటెండెంట్) లేదా
4. ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగి ఉండాలి.
GDA / MNO / FNO :
SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత.
పోస్ట్‌మార్టం అసిస్టెంట్ :
SSC/10వ తరగతి ఉత్తీర్ణత.
ఆఫీస్ సబార్డినేట్ :
SSC/10వ తరగతి లేదా సమాన అర్హత.

వయోపరిమితి :
01 జూలై 2026 నాటికి కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
వయోసడలింపులు :
SC/ST/BC/EWS వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
మాజీ సైనికులకు – సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు
దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము :
1. OC అభ్యర్థులు – రూ.350/-
2. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (SC/ST/BC/EWS) వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
3. దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు పూర్తిగా మినహాయింపు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000/- వేతనం అందించబడుతుంది.
ఎంపిక విధానం :
1. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు.
2. అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
3. విద్యార్హతలో సాధించిన మార్కులకు 75% వెయిటేజ్
4. అర్హత పొందిన తర్వాత ప్రతి పూర్తి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు
5. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయిటేజ్ మార్కులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం :
1. దరఖాస్తు ఫారమ్ 01 జూలై 2026 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
2. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి 07 జూలై 2026 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలి.
3. దరఖాస్తులను DCHS కార్యాలయం, ఓల్డ్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణం, పల్నాడు రోడ్, నరసరావుపేటలోని నిర్ణీత కౌంటర్లలో కార్యాలయ వేళల్లో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 01 జూలై 2026
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07 జూలై 2026

Notification Pdf Click Here
Application Pdf Click Here
Official Website Click Here