AP Jobs

ఏపీ దేవాదాయ శాఖలో 104 పర్మనెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి.  | APPSC Executive Officer Recruitment 2026 : 

calendar_month September 15, 2026 person chitra

ఏపీ దేవాదాయ శాఖలో 104 పర్మనెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి.  | APPSC Executive Officer Recruitment 2026 :

APPSC Executive Officer Recruitment 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) A.P. Endowments Subordinate Serviceలో Executive Officer Grade-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 16 అక్టోబర్ 2026 నుంచి 5 నవంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఉద్యోగాలు
శాఖ: A.P. Endowments Subordinate Service
పోస్టుల వివరాలు : Executive Officer Grade-III లో ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 104
విద్యా అర్హతలు : 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తించిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి : 
ఈ ఉద్యోగాలకు సంబంధించి నాన్-యూనిఫాం పోస్టులకు సాధారణ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచినట్లు సమాచారం. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము : 
1. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250/-  మరియు పరీక్ష ఫీజుగా రూ.80/-  చెల్లించాలి.
2. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం SC, ST, BC, PH మరియు మాజీ సైనికులు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందుతారు.
జీతం వివరాలు :
Executive Officer Grade-III పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910 /- వరకు పే స్కేల్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి వర్తించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు నిబంధనల ప్రకారం ఉంటాయి.
ఎంపిక విధానం : 
అభ్యర్థుల ఎంపికకు APPSC నిబంధనల ప్రకారం పరీక్షలు, తదుపరి దశలు నిర్వహిస్తారు.
1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
1. APPSC అధికారిక వెబ్‌సైట్‌ ( https://psc.ap.gov.in ) ను ఓపెన్ చేయాలి.
2. Careers/Recruitment విభాగంలో సంబంధిత Executive Officer Grade-III నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.
3. ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
4. అభ్యర్థి వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ తదితర వివరాలను నమోదు చేయాలి.
5. అవసరమైన పత్రాలను సూచించిన విధంగా సమర్పించాలి.
6. వర్తించే దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
7. దరఖాస్తును సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు : 
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 16 అక్టోబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05 నవంబర్ 2026

NotificationPdf Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *