Central Govt Jobs

BEL Recruitment 2026: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. డిప్లొమా, ITI అర్హతతో శాశ్వత ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి!

calendar_month June 11, 2026 person chitra

BEL Recruitment 2026: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. డిప్లొమా, ITI అర్హతతో శాశ్వత ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి!

BEL Recruitment 2026:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి భారీ శుభవార్త అందింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 2026 సంవత్సరానికి Engineering Assistant Trainee (EAT) మరియు Technician-C పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా 11 జూన్ 2026 నుంచి 02 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT)

2. టెక్నీషియన్-C పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 06

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) :

గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, PwBD అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

టెక్నీషియన్-C :

గుర్తింపు పొందిన సంస్థ నుంచి SSLCతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI మరియు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) లేదా సంబంధిత ట్రేడ్‌లో మూడు సంవత్సరాల NAC కోర్సు పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, PwBD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి :

1. 01 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు

3. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / OBC (NCL) / EWS అభ్యర్థులు : రూ.500 + 18% GST (మొత్తం రూ.590)

2. SC / ST / PwBD / మాజీ సైనికులకు : ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

జీతం వివరాలు :

1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలకు మొదటి ఆరు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.24,000 స్టైపెండ్ అందజేస్తారు.

2. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం రెగ్యులర్ పే స్కేల్‌లో నియామకం చేస్తారు.

3. జీతం : రూ.24,500 నుండి రూ.90,000 వరకు ఇస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను కింది దశల ద్వారా నిర్వహిస్తారు.

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2. స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ ఎగ్జామినేషన్

5. అర్హులైన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు BEL వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచబడతాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి.

2. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు చేసి, సంబంధిత ఫీజును చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 11 జూన్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 02 జూలై 2026

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందాలనుకునే డిప్లొమా, ITI అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Notification Pdf Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *