CISF ASI Jobs : 12th అర్హతతో సెక్యూరిటీ ఫోర్స్ లో ASI నోటిఫికేషన్ విడుదల… | CISF ASI Paramedical Staff Recruitment 2026:
CISF ASI Jobs : 12th అర్హతతో సెక్యూరిటీ ఫోర్స్ లో ASI నోటిఫికేషన్ విడుదల… | CISF ASI Paramedical Staff Recruitment 2026 :
CISF ASI Paramedical Staff Recruitment 2026 :
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధ్వర్యంలో ASI (ఫార్మసిస్ట్), ASI ఎక్స్-రే టెక్నీషియన్ మరియు ASI ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన పురుష మరియు మహిళా భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 08 జూన్ 2026 నుండి ప్రారంభమై, 07 జూలై 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతం అందజేయబడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ASI ఫార్మసిస్ట్,
2. ASI ఎక్స్-రే టెక్నీషియన్,
3. ASI ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 24
ఉద్యోగ స్వభావం : శాశ్వత ఉద్యోగాలు
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
విద్యార్హతలు :
ASI (ఫార్మసిస్ట్) :
1. గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10+2 ఉత్తీర్ణతతో పాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుంచి ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. అలాగే ఫార్మసీ చట్టం-1948 ప్రకారం ఫార్మసిస్ట్‌గా నమోదు అయి ఉండాలి.
ASI (ఎక్స్-రే టెక్నీషియన్) :
10+2 ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి రేడియోగ్రఫీలో రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ASI (ల్యాబ్ టెక్నీషియన్) :
సైన్స్ విభాగంతో 10+2 ఉత్తీర్ణత సాధించి, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో రెండు సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
1. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు : 3 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
1. UR, OBC, EWS అభ్యర్థులు : రూ.100
2. మహిళా అభ్యర్థులు, SC, ST మరియు మాజీ సైనికులకు : రుసుము లేదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు లెవల్-5 పే మ్యాట్రిక్స్ ప్రకారం నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు ఆకర్షణీయమైన వేతనం అందజేయబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది.
1. వ్రాత పరీక్ష
2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
3. డాక్యుమెంట్ల పరిశీలన
4. బేసిక్ వొకేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ (BVAT)
5. వైద్య పరీక్ష
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అర్హత కలిగిన అభ్యర్థులు CISF అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. అర్హత కలిగిన అభ్యర్థులు 08 జూన్ 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 07 జూలై 2026 రాత్రి 11:59 గంటలు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 08 జూన్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 07 జూలై 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Office Website Click Here