Information

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోగో డిజైన్ పోటీ.. విజేతలకు రూ.20,000 వరకు నగదు బహుమతులు!

calendar_month July 27, 2026 person chitra

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోగో డిజైన్ పోటీ.. విజేతలకు రూ.20,000 వరకు నగదు బహుమతులు!

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోగో డిజైన్ పోటీ:

సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారిక లోగో రూపకల్పన కోసం ప్రత్యేక లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. ఈ పోటీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు మరియు క్రియేటివ్ రంగ నిపుణులు ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది.

బహుమతుల వివరాలు :

పోటీలో ఉత్తమంగా ఎంపికైన వారికి నగదు బహుమతులు అందజేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ప్రథమ బహుమతి – రూ.20,000

ద్వితీయ బహుమతి – రూ.15,000

తృతీయ బహుమతి – రూ.10,000

ముఖ్యమైన తేదీలు :

ఎంట్రీల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 5, 2026

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విజేతల ప్రకటన: ఆగస్టు 10, 2026

అధికారిక లోగో ఆవిష్కరణ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా

అభ్యర్థులు అధికారిక QR కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ డిజైన్‌లను సమర్పించాలి.

లోగోలో ఉండాల్సిన అంశాలు :

సైబరాబాద్ నగర ప్రత్యేకతను ప్రతిబింబించే విధంగా లోగోను రూపొందించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఈ అంశాలు ప్రతిఫలించేలా ఉండాలి.

సుపరిపాలన

సుస్థిర అభివృద్ధి

ఆధునిక నగర దృక్పథం

శాశ్వత గుర్తింపును కలిగించే ప్రత్యేక రూపకల్పన

ఎంట్రీ సమర్పణ నిబంధనలు

పోటీలో పాల్గొనే వారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

1. లోగో పూర్తిగా ఒరిజినల్ డిజైన్ అయి ఉండాలి

2. AI, EPS లేదా SVG వెక్టర్ ఫార్మాట్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.అధిక నాణ్యత గల PNG లేదా JPEG ఫైల్‌ను కూడా సమర్పించాలి.

3. లోగో వెనుక ఉన్న ఆలోచనను గరిష్ఠంగా 250 పదాల్లో వివరించాలి.

4. ప్రతి అభ్యర్థి ఒకే ఒక్క ఎంట్రీ మాత్రమే సమర్పించాలి.

5. కాపీరైట్ ఉల్లంఘన చేసిన లేదా కృత్రిమ మేధ (AI) ద్వారా నకలు చేసిన డిజైన్లు అంగీకరించబడవు.

6. డిజిటల్ మరియు ప్రింట్ వినియోగానికి అనువుగా ఉన్న లోగోలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

7.సృజనాత్మకతను ప్రదర్శించే మంచి అవకాశం

సైబరాబాద్‌కు శాశ్వత గుర్తింపుగా నిలిచే అధికారిక లోగో రూపకల్పనలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. డిజైన్ రంగంలో ప్రతిభ కలిగిన వారు ఈ పోటీలో పాల్గొని నగదు బహుమతులతో పాటు గుర్తింపు కూడా పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *