DRDO Jobs 2026: DRDO-INMASలో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు – ఫ్రెషర్స్‌కు అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి..
DRDO Jobs 2026: DRDO-INMASలో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు – ఫ్రెషర్స్‌కు అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి..
DRDO Jobs 2026:
దేశ రక్షణ పరిశోధన రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) శుభవార్త అందించింది. ఢిల్లీలోని Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS)లో Research Associate (RA), Junior Research Fellow (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 15 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. M.Sc, M.Tech, M.Pharm, PhD అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : DRDO- Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Research Associate (RA) – 4
2. Junior Research Fellow (JRF) – 11 పోస్టులు
మొత్తం పోస్టులు : 15
ఉద్యోగ ప్రదేశం: న్యూఢిల్లీ
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా
విద్య అర్హతలు :
Research Associate (RA) :
సంబంధిత విభాగంలో PhD ఉత్తీర్ణత తప్పనిసరి.
Junior Research Fellow (JRF) :
Life Sciences: ఫస్ట్ క్లాస్ M.Sc./M.Tech మరియు NET లేదా GATE అర్హత.
Chemistry: ఫస్ట్ క్లాస్ M.Sc./M.Techతో పాటు NET లేదా GATE అర్హత.
Pharmaceutics: M.Pharm లేదా M.Tech (Pharm)తో పాటు GPAT/NET అర్హత.
Dental Sciences: ఫస్ట్ క్లాస్ BDSతో పాటు Dental Council రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయో పరిమితి :
Research Associate: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
Junior Research Fellow: గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
వయస్సు సడలింపు :
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్ వివరాలు :
Research Associate (RA) :
1. నెలకు రూ.67,000 /- స్టైపెండ్.
2. అదనంగా HRA, సంవత్సరానికి రూ.20,000 వరకు కాంటింజెన్సీ గ్రాంట్
Junior Research Fellow (JRF) :
1. మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.37,000 /-
2. SRF హోదాకు పదోన్నతి అనంతరం నెలకు రూ.42,000 /-
3. అదనంగా HRA, వార్షికంగా రూ.15,000 వరకు కాంటింజెన్సీ గ్రాంట్
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు.
1. దరఖాస్తులు మరియు సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్టింగ్.
2. అవసరమైతే రాత పరీక్ష నిర్వహణ.
3. అర్హత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ.
ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన వేదిక: INMAS ప్రధాన ప్రవేశ ద్వారం (Main Gate Reception), బ్రిగేడియర్ ఎస్.కే. మజుందార్ మార్గ్, తిమార్‌పూర్, న్యూఢిల్లీ – 110054.
సమయం : ఉదయం 8.00 గంటల నుంచి 9.30 గంటల మధ్య హాజరు కావాలి.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్ నుంచి Annexure-A దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఫారమ్‌ను టైప్ చేసి పూర్తి వివరాలతో నింపాలి.
3. విద్యార్హత సర్టిఫికెట్లు, వయస్సు ధ్రువీకరణ, NET/GATE/GPAT స్కోర్ కార్డు తదితర పత్రాలను స్కాన్ చేయాలి.
4. అన్ని పత్రాలను ఒకే PDF ఫైల్‌గా రూపొందించాలి.
5. PDF ఫైల్‌కు POST CODE_పేరు ఫార్మాట్‌లో పేరు ఇవ్వాలి.
6. research-academic@gov.in ఈ-మెయిల్ ఐడీకి 30 జూన్ 2026లోపు పంపాలి.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ : 01 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 30 జూన్ 2026
ఇంటర్వ్యూ తేదీలు :
RA-01 (Life Sciences) : 15 జూలై 2026
RA-02 (Chemistry) : 17 జూలై 2026
RA-03 (Pharmaceutical Sciences) : 20 జూలై 2026
JRF-01 (Life Sciences) : 20 జూలై 2026
JRF-02 (Chemistry) : 22 జూలై 2026
JRF-03 (Pharmaceutics) : 23 జూలై 2026
JRF-04 (Dental Sciences) : 24 జూలై 2026
ప్రభుత్వ పరిశోధనా రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని భావిస్తున్న యువతకు DRDO-INMAS విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification pdf : Click Here
Official Website : Click Here