AP Jobs

Postal Jobs 2026: 8వ తరగతి అర్హతతో భారత తపాలా శాఖలో పర్మనెంట్ గ్రూప్-C ఉద్యోగాలు.. అప్లికేషన్‌కు చివరి తేదీ జూలై 18…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 27, 2026 person chitra

Postal Jobs 2026: 8వ తరగతి అర్హతతో భారత తపాలా శాఖలో పర్మనెంట్ గ్రూప్-C ఉద్యోగాలు.. అప్లికేషన్‌కు చివరి తేదీ జూలై 18…వెంటనే అప్లై చేసుకోండి.

India Post Skilled Artisans Recruitment 2026 | Permanent Group-C Jobs | Offline Application :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత తపాలా శాఖ (India Post) శుభవార్త అందించింది. బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్ (Mail Motor Service) కార్యాలయంలో స్కిల్డ్ ఆర్టిసన్స్ (Group-C) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు పర్మనెంట్ (General Central Service – Non-Ministerial) కేటగిరీకి చెందినవి.

ఈ నోటిఫికేషన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ 18 జూలై 2026 సాయంత్రం 5:00 గంటల వరకు సమయం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారత తపాలా శాఖ (India Post) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

భారత తపాలా శాఖలో కింది స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

1. M.V. Mechanic (Skilled)

2. Upholster (Skilled)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. Carpenter-cum-Jointer (Skilled)

4. Painter (Skilled) పోస్టులు

విద్యార్హతలు :

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.

1. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి 8వ తరగతి ఉత్తీర్ణత.

2. సంబంధిత ట్రేడ్‌లో టెక్నికల్ సర్టిఫికేట్ లేదా కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.

3. ట్రేడ్ సర్టిఫికేట్ లేని అభ్యర్థులు తప్పనిసరిగా అనుభవ ధృవీకరణ పత్రం సమర్పించాలి.

4. M.V. Mechanic పోస్టుకు దరఖాస్తు చేసేవారు హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి :

01 జనవరి 2026 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

వయో సడలింపు :

1.SC, ST, BC మరియు EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

2. దివ్యాంగులకు : 10 సంవత్సరాలు

3. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

దరఖాస్తుతో పాటు రూ.100 విలువైన Indian Postal Order (IPO) లేదా The Manager, Mail Motor Service, Bengaluru-01 పేరిట తీసుకున్న UCR రసీదు జతచేయాలి.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు నెలవారీ వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది.

1. ట్రేడ్ టెస్ట్ / రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. డ్రైవింగ్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

6. ట్రేడ్ పరీక్షకు సంబంధించిన తేదీ, సిలబస్, పరీక్షా కేంద్రం వివరాలను అర్హులైన అభ్యర్థులకు హాల్ టికెట్‌తో పాటు తెలియజేస్తారు.

దరఖాస్తు విధానం :

1. అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్ల స్వీయ ధృవీకరించిన ప్రతులతో కలిసి కింది చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.

చిరునామా:

The Manager
Mail Motor Service
Department of Posts
No.4, Basaveshwara Road
Vasanth Nagar
Bengaluru – 560001.

2. స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

3. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

4. అసంపూర్ణ దరఖాస్తులు, అవసరమైన సర్టిఫికెట్లు జత చేయని దరఖాస్తులు లేదా స్వీయ ధృవీకరణ లేని పత్రాలతో పంపిన దరఖాస్తులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తిరస్కరించబడతాయి.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ: 18 జూలై 2026

Notification & Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *