Govt. Schemes

Rythu Bharosa Scheme 2026: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ.. పూర్తి వివరాలు ఇవే!

calendar_month June 29, 2026 person chitra

Rythu Bharosa Scheme 2026: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ.. పూర్తి వివరాలు ఇవే!

 రైతు భరోసా రూ.6000 విడుదల – తెలంగాణ రైతులకు శుభవార్త : 

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 30న ఖమ్మం జిల్లాలోని మత్తేపల్లి సభలో రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయబడుతుంది. ఈ చెల్లింపులు విడతల వారీగా జూలై 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు రూ.9,000 కోట్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కొత్త పట్టాదారులకు ప్రత్యేక అవకాశం :

2026 జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకం ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే వీరు జూలై 5లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

అర్హులైన రైతులు తమ సమీప రైతు వేదిక లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి దరఖాస్తును సమర్పించాలి.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది పత్రాలను సమర్పించాలి.

ఆధార్ కార్డు
పట్టాదారు పాస్‌బుక్
బ్యాంక్ ఖాతా మొదటి పేజీ జిరాక్స్
1-బీ (1B) భూ పత్రం
భూభారతి పోర్టల్ నుంచి తీసుకున్న భూమి వివరాలు
పూర్తిగా నింపిన రైతు భరోసా దరఖాస్తు ఫారం

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అన్ని పత్రాలను జత చేసి సంబంధిత రైతు వేదికలో సమర్పించాల్సి ఉంటుంది.

రైతు భరోసా పథకానికి అర్హతలు ;

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే దరఖాస్తుదారులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.

1. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి.

2. కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.

3. వ్యవసాయ భూమి దరఖాస్తుదారుని పేరుపై నమోదు అయి ఉండాలి.

4. భూమి భూభారతి పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి.

5. సాగుకు అనువైన వ్యవసాయ భూమి మాత్రమే అర్హత పొందుతుంది.

ఈ భూములకు రైతు భరోసా వర్తించదు :

క్రింది రకాల భూములు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు కారు.

1. బీడు భూములు

2. రాళ్లు, రప్పలు ఉన్న భూములు

3. కొండ ప్రాంతాలు

4. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు

5. కాలువలు, వాణిజ్య అవసరాలకు వినియోగించే భూములు

6. సాగుకు అనువుకాని ఇతర భూములు

అలాగే తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసి పథకం ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు హెచ్చరించారు.

ముఖ్య గమనిక :

రైతు భరోసా నిధులు అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా జమ చేయబడతాయి. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు జూలై 5లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *