తల్లికి వందనం 2026: జూలై 22న తల్లికి వందనం డబ్బులు విడుదల.. రూ.13,000 పొందే అర్హులు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి!
తల్లికి వందనం 2026: జూలై 22న తల్లికి వందనం డబ్బులు విడుదల.. రూ.13,000 పొందే అర్హులు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి!
తల్లికి వందనం 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం (Talliki Vandanam Scheme 2026) పథకానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన ప్రతి విద్యార్థి కోసం ప్రభుత్వం రూ.13,000 ఆర్థిక సహాయాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా (DBT ద్వారా) జమ చేయనుంది.ఈ నిధులను జూలై 22, 2026న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఈసారి కొత్తగా కొన్ని వర్గాల విద్యార్థులను కూడా పథకంలో చేర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తల్లికి వందనం పథకం కింద రూ.13,000 ఎవరికి?
2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రూ.10,120.78 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000లో రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధుల కోసం మినహాయించి, మిగిలిన రూ.13,000ను తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
ఈసారి కొత్తగా వీరికి కూడా అవకాశం :
ఈ ఏడాది తల్లికి వందనం పథకం పరిధిని మరింత విస్తరించారు.
1. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు (1వ తరగతి నుంచి ఇంటర్ వరకు)
2. శానిటేషన్ వర్కర్ల పిల్లలు
3. ఈ వర్గాల అర్హులైన విద్యార్థులకు కూడా పథకం ప్రయోజనం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ముఖ్య సమాచారం :
1వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా చేరిన విద్యార్థులు 2026 ఆగస్టు 25లోపు అడ్మిషన్ పూర్తి చేస్తే తల్లికి వందనం పథకానికి అర్హత పొందుతారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక సూచనలు
2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరుతో బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
అలాగే:
1. విద్యార్థి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
2. NPCI మ్యాపింగ్ (Seeding) పూర్తి చేయాలి.
3. అవసరమైతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా ఖాతా తెరవచ్చు.
4. అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
జనన ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మెమో
ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్
గమనిక: బ్యాంక్ ఖాతా లేకపోవడం లేదా NPCI మ్యాపింగ్ పూర్తి కాకపోతే పథకం ప్రయోజనం పొందే అవకాశం కోల్పోవచ్చు.
తల్లికి వందనం 2026 ముఖ్యమైన తేదీలు :
జూలై 22, 2026 : 64,76,590 మంది అర్హుల జాబితా విడుదల
1. మొదటి విడత రూ.13,000 నిధుల జమ
2. గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హులు – అనర్హుల జాబితా ప్రదర్శన
జూలై 22 నుంచి ఆగస్టు 3, 2026 వరకు : అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ
ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10, 2026 వరకు : ఫిర్యాదుల పరిశీలన, అదనపు అర్హుల జాబితా తయారీ
ఆగస్టు 25, 2026 : 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కొత్త అడ్మిషన్లకు చివరి తేదీ
ఆగస్టు 30, 2026 :
అదనపు అర్హుల జాబితా విడుదల
రెండో విడత నిధుల జమ
మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు :
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 24, 2026న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాంపచోడవరం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.
నిధులు జమ కావాలంటే తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకోండి ?
తల్లికి వందనం పథకం డబ్బులు ఖాతాలో జమ కావాలంటే ఈ అంశాలు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
1. తల్లి ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
2. e-KYC పూర్తి చేసి ఉండాలి.
3. NPCI మ్యాపింగ్ (Seeding) పూర్తయి ఉండాలి.
4. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి.
ఈ వివరాలను ముందుగానే బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో చెక్ చేసుకుని అవసరమైన మార్పులు పూర్తి చేసుకుంటే నిధుల జమలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.