Govt. Schemes

తల్లికి వందనం డబ్బులు ఇంకా అకౌంట్‌లో పడలేదా? ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme 2026 :

calendar_month July 24, 2026 person chitra

తల్లికి వందనం డబ్బులు ఇంకా అకౌంట్‌లో పడలేదా? ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme 2026 :

తల్లికి వందనం డబ్బులు స్టేటస్, పథకం నిధులు, చెల్లింపు వివరాలు : 

తల్లికి వందనం డబ్బులు ఇంకా మీ బ్యాంక్ ఖాతాలో పడలేదా? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేస్తోంది. జూలై 24 వరకు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్, e-KYC వివరాలు పరిశీలించి అవసరమైతే గ్రామ లేదా వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి.

అర్హత ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేయాలి. అధికారులు దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే తదుపరి విడతలో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటారు. అలాగే LEAP App, BM Portal లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp సేవ ద్వారా ఎప్పటికప్పుడు పేమెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అదనంగా, విద్యుత్ బిల్లు లేదా ఇతర అర్హత సమస్యల కారణంగా లబ్ధి పొందని వారు కూడా సచివాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ఫిర్యాదుల పరిశీలన అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు అదనపు అర్హుల జాబితా సిద్ధం చేయనున్నారు. అలాగే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్త అడ్మిషన్లకు ఆగస్టు 25 చివరి తేదీగా నిర్ణయించారు. అనంతరం అర్హుల రెండో (Second Merit) జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది.

తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

1. LEAP App ద్వారా Payment Status చూసుకోవచ్చు.

2. BM Portalలో ఆధార్ నంబర్ నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.

3. ” WhatsApp Governance (9552300009)” కు HI పంపి Thalliki Vandanam Status సేవ ద్వారా కూడా వివరాలు చెక్ చేసుకోవచ్చు.

స్టేటస్‌లో Eligible అని కనిపించినా డబ్బులు జమ కాకపోతే ఒకసారి మీ బ్యాంక్‌ను సంప్రదించి ఖాతా వివరాలు నిర్ధారించుకోవడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *