TS 10th Class Results 2026 Today Release : ఈరోజే ఫలితాలు – ఈ 4 వెబ్‌సైట్లలో ఒక్క సెకండ్‌లో తెలుసుకోండి!
TS 10th Class Results 2026 Today Release : ఈరోజే ఫలితాలు – ఈ 4 వెబ్‌సైట్లలో ఒక్క సెకండ్‌లో తెలుసుకోండి!
TS 10th Class Results 2026 today release :
తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు (ఏప్రిల్ 29, 2026) మధ్యాహ్నం 2:00 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపిన ప్రకారం, ఫలితాలను గోదావరి ఆడిటోరియంలో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొంటారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా షార్ట్ మెమో కూడా అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
TS 10th Results 2026 Direct Links:
విద్యార్థులు తమ ఫలితాలను క్రింది అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు:
1. https://results.bsetelangana.org/
2. https://results.bse.telangana.gov.in/
3. https://bse.telangana.gov.in/
4. https://schooledu.telangana.gov.in/
పరీక్షల వివరాలు :
1. ఈ ఏడాది తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించారు.
2. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
3. సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల మధ్య 3–4 రోజుల విరామం కూడా ఇచ్చారు.
WhatsApp ద్వారా ఫలితాలు పొందే విధానం :
తెలంగాణ ప్రభుత్వం మీ సేవ (Meeseva) ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మధ్యాహ్నం 2:30 గంటల నుండి వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
Step-by-step విధానం:
1. మీ మొబైల్‌లో 8096958096 నెంబర్‌ను Meeseva Telangana గా సేవ్ చేయండి.
2. WhatsApp ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు Hi అని మెసేజ్ పంపండి.
3. “SSC Results” అని టైప్ చేసి పంపండి.
4. “Open Service” పై క్లిక్ చేయండి.
5. మీ Hall Ticket Number నమోదు చేయండి.
6. కొన్ని సెకండ్స్‌లోనే PDF రూపంలో మీ ఫలితాలు పొందవచ్చు.
ముఖ్య సూచనలు:
1. ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లు స్లో అవ్వొచ్చు, కాబట్టి patience తో ప్రయత్నించండి.
2. అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించండి.
3. ఫలితాలను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవడం మంచిది.