Latest jobs

తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు:

calendar_month February 13, 2026 person chitra

తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ నియామకాలు 2026 – గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ (సర్వీసెస్-II) శాఖలో గ్రామీణ పరిపాలనను బలోపేతం చేయడానికి “గ్రామ పాలన అధికారి సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2026” ప్రకారం కొత్తగా నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు జి.ఓ.ఎం.ఎస్ నం.32 తేదీ 12.02.2026న ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మొత్తం 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులను సృష్టించి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 5,000 పైగా పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేయగా, మిగిలిన 5,954 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ (GPO) రిక్రూట్‌మెంట్ 2026 – పూర్తి వివరాలు:

సంస్థ పేరు: తెలంగాణ రెవెన్యూ శాఖ లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు:

గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఉన్నాయి.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు : 5,954

ఉద్యోగ విధానం : రెగ్యులర్ బేసిస్

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు:

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా దరఖాస్తు చేసే అభ్యర్థులు:

1. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా

2. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుభవం అవసరం ఉండవచ్చు).

వయస్సు:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు ,గరిష్ట వయస్సు: 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

1. గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ₹34,000/- పైగా జీతం చెల్లించబడుతుంది.

2. ఇతర భత్యాలు కూడా ప్రభుత్వ నియమాల ప్రకారం అందిస్తారు.

ఎంపిక విధానం:

ఈ నియామక ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది

1. రాత పరీక్ష

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ccla.telangana.gov.in/ లో పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం : త్వరలో అధికారిక నోటిఫికేషన్

చివరి తేదీ : త్వరలో ప్రకటించబడుతుంది

GPO Jobs : రెవెన్యూ శాఖలో గ్రామీణ పాలన అధికారి విద్య అర్హత వివరాలు | Telangana Revenue Department Recruitment 2026 Eligibility All Details in Telugu »

Notification pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *