Latest jobs

Big Update: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో 5,538 టీచర్ & ఆయా ఉద్యోగాలు | Pre Primary School Instructor & Aaya Recruitment 2026 :

calendar_month June 7, 2026 person chitra

Big Update: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో 5,538 టీచర్ & ఆయా ఉద్యోగాలు | Pre Primary School Instructor & Aaya Recruitment 2026 :

TS టీచర్ & ఆయా ఉద్యోగాలు 2026 :

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం భారీ స్థాయిలో టీచర్ & ఆయా ఉద్యోగాలు 2026 భర్తీ చేయనున్నారు. మొత్తం 5,538 పోస్టులను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. స్థానిక మహిళా అభ్యర్థులకు ఈ నియామకాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, LKG, UKG తరగతుల నిర్వహణ కోసం భారీ స్థాయిలో 5,538 ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయా చొప్పున నియామకాలు చేపట్టనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు – 2,769

ఆయా పోస్టులు – 2,769

మొత్తం పోస్టులు : 5,538

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ :

ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత తప్పనిసరి.

ఆయా పోస్టులు :

కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం వివరాలు :

1. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు ₹8,000/- గౌరవ వేతనం

2. ఆయాలకు నెలకు ₹6,000 గౌరవ వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం :

1. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా నిర్వహించబడుతుంది.

2. ఈ నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి.

3. ఒక విద్యా సంవత్సరంలో 10 నెలలకు మాత్రమే పారితోషికం చెల్లించబడుతుంది.

దరఖాస్తు చివరి తేదీ :

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారులకు (MEO) 08 జూన్ 2026 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలి.

సమర్పించాల్సిన పత్రాలు :

విద్యార్హతల ధృవపత్రాలు

నివాస ధృవీకరణ పత్రం

ఆధార్ కార్డు జిరాక్స్

ఇతర అవసరమైన పత్రాల ప్రతులు

స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత :

నియామకాల్లో ఈ క్రమంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది:

1. ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్న హ్యాబిటేషన్‌లో నివసించే వారికి

2. సంబంధిత గ్రామపంచాయతీ పరిధిలో నివసించే వారికి

3. ఆయా మండలంలో నివసించే వారికి

4. సంబంధిత జిల్లాలో నివసించే వారికి

ముఖ్యమైన సూచన :

ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఎంపికైన పాఠశాలల వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు తమ సంబంధిత మండల విద్యాధికారుల (MEO) కార్యాలయాలను సంప్రదించవచ్చు.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *