జిల్లా ఉద్యోగ మార్పిడి కార్యాలయం ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా – 450 ఉద్యోగాలు:
జిల్లా ఉద్యోగ మార్పిడి కార్యాలయం ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా – 450 ఉద్యోగాలు:
విశాఖపట్నం లో భారీ జాబ్ మేళా :
యువతకు శుభవార్త! విశాఖపట్నంలో ఉన్న జిల్లా ఉద్యోగ మార్పిడి కార్యాలయం ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
విశాఖపట్నం పాత ఐటీఐ రోడ్డులోని ప్రభుత్వ మహిళా ఐటీఐ క్యాంపస్‌లో ఏప్రిల్ 4, 2026న ఈ ఉపాధి మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో గోద్రెజ్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ సంస్థలు సహా మొత్తం 4 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ సంస్థల ద్వారా సుమారు 450 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఎస్ఎస్‌సి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు గరిష్టంగా రూ.20,000 వరకు జీతం అందించడంతో పాటు PF, ESI వంటి సౌకర్యాలు కూడా కల్పించబడతాయి.
Visakhapatnam Job Mela 2026 – పాల్గొనే సంస్థలు & ఉద్యోగాల వివరాలు:
1. ATM Cash Loaders:
పోస్టు: ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 100
అర్హత: ఇంటర్ నుండి ఏదైనా డిగ్రీ
వయసు: 18–35 సంవత్సరాలు
జీతం: రూ.13,000 నుండి
2. Godrej :
పోస్టు: కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 50
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 18–35 సంవత్సరాలు
జీతం: రూ.18,000 – 20,000 + PF + ESI
3. Navata Road Transport :
పోస్టులు: క్యాషియర్ క్లర్క్ / హెవీ డ్రైవర్
ఖాళీలు: 100
అర్హత: ఇంటర్ / డిగ్రీ / SSC (హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి)
వయసు: 19–25 సంవత్సరాలు
జీతం: రూ.11,000 నుండి మొదలు
4. Tata Electronics :
పోస్టు: జూనియర్ టెక్నీషియన్
ఖాళీలు: 200
అర్హత: ఇంటర్ / డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)
వయసు: 18–35 సంవత్సరాలు
జీతం: రూ.14,000 నుండి మొదలు
జాబ్ మేళా వివరాలు:
Interivew తేదీ: 04 ఏప్రిల్ 2026
వేదిక: Govt. Women’s ITI Campus, Old ITI Road, Industrial Estate, Visakhapatnam
పాల్గొనే సంస్థలు: 4
మొత్తం ఖాళీలు: 450
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now