WCL Recruitment 2026: 10వ తరగతి అర్హతతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 95 ఉద్యోగాలు.. మెరిట్‌తోనే ఎంపిక!…వెంటనే అప్లై చేసుకోండి.
WCL Recruitment 2026: 10వ తరగతి అర్హతతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 95 ఉద్యోగాలు.. మెరిట్‌తోనే ఎంపిక!…వెంటనే అప్లై చేసుకోండి.
WCL Recruitment 2026:
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL), నాగ్‌పూర్ తాజాగా మైనింగ్ సర్దార్ (Grade-C) మరియు సర్వేయర్ (Grade-B) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
మైనింగ్ సర్దార్ (Grade-C) – 66 పోస్టులు
సర్వేయర్ (Grade-B) – 29 పోస్టులు
మొత్తం ఖాళీలు: 95
విద్యార్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.
2. DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే Sirdar/Overman Competency Certificate.
3. Gas Testing Certificate.
4. First Aid Certificate.
5. సంబంధిత రంగంలో పని అనుభవం.
ఎంపిక విధానం :
1. ఈ నియామకాల్లో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
2. ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించకుండా, నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు మరియు మెరిట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం :
1. దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయి.
2. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకుని దరఖాస్తును పూర్తి చేయాలి.
3. అవసరమైన సర్టిఫికెట్లు మరియు వివరాలను సరిగ్గా అప్లోడ్ చేసి, చివర్లో దరఖాస్తును సమర్పించాలి.
ముఖ్యమైన తేదీ :
దరఖాస్తు చివరి తేదీ: జూలై 17, 2026
Official Website : Click Here