E-District Manager & E-Divisional Manager ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి! YSR కడప జిల్లా రిక్రూట్‌మెంట్ 2026:
E-District Manager & E-Divisional Manager ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి! YSR కడప జిల్లా రిక్రూట్‌మెంట్ 2026:
YSR కడప జిల్లా రిక్రూట్‌మెంట్ 2026:
కంప్యూటర్ మరియు ఐటీ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు YSR కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం శుభవార్త అందించింది. జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో E-District Manager, E-Divisional Manager పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టబడుతున్నాయి. అర్హతలు, అనుభవం కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : YSR కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. E-District Manager
2. E-Divisional Manager పోస్టులు
ఉద్యోగ స్థలం : Kadapa , Pulivendula
ఉద్యోగ రకం : కాంట్రాక్టు బేసిస్
విద్యార్హతలు :
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలలో ఏదైనా కలిగి ఉండాలి.
2. BCA, BE / B.Tech, MCA కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన డిగ్రీ.
3. అదనంగా, ఇంగ్లీష్ మరియు స్థానిక భాషపై అవగాహనతో పాటు ఐటీ లేదా ఈ-గవర్నెన్స్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయో పరిమితి :
1. 2026 మే 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఈ నియామకాలకు రిజర్వేషన్ నిబంధనలు వర్తించవు.
దరఖాస్తు రుసుము :
1. అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజును Demand Draft రూపంలో చెల్లించాలి.
2. డిమాండ్ డ్రాఫ్ట్‌ను “Administrative Officer, Collector Office, Kadapa” పేరిట తీసుకోవాలి.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹22,500/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. అభ్యర్థుల ఎంపికను రాత పరీక్షలో సాధించిన మార్కులు, సంబంధిత రంగంలో ఉన్న అనుభవం, ఉన్నత విద్యార్హతలు మరియు పని సామర్థ్యాల ఆధారంగా నిర్వహిస్తారు.
2. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
3. అదనంగా, కంప్యూటర్స్ విభాగంలో పీజీ లేదా పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక వెయిటేజ్ మార్కులు కేటాయించబడతాయి.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అర్హత మరియు అనుభవం కలిగిన అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ ధృవపత్రాలు, వయస్సు నిర్ధారణ పత్రం, ఫోటో ఐడీ ప్రూఫ్ మరియు ఇతర సంబంధిత పత్రాలను స్వీయ ధృవీకరణ (Self Attested) చేసి జత చేయాలి.
2. అలాగే రూ.500 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్‌ను “Administrative Officer, Collector Office, Kadapa” పేరిట జత చేసి, పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత గడువులోపు సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలి.
3. అసంపూర్తిగా ఉన్న లేదా గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
4. దరఖాస్తులు సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.
ముఖ్యమైన తేదీలు :
| కార్యక్రమం | తేదీ |
|---|---|
| దరఖాస్తుల ప్రారంభం | 06-06-2026 |
| చివరి తేదీ | 20-06-2026 |
| స్క్రూటినీ | 22-06-2026 నుండి 24-06-2026 |
| తాత్కాలిక మెరిట్ లిస్ట్ | 27-06-2026 |
| అభ్యంతరాల స్వీకరణ | 29-06-2026 |
| సర్టిఫికేట్ వెరిఫికేషన్ | 01-07-2026 |
| స్కిల్ టెస్ట్ | 07-07-2026 |