10వ తరగతి అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగాలు… | Lakshmibai College Lab Attendant Recruitment 2026 :
10వ తరగతి అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగాలు… | Lakshmibai College Lab Attendant Recruitment 2026 :
Lakshmibai College Lab Attendant Recruitment 2026:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఢిల్లీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల (Lakshmibai College) శాశ్వత ప్రాతిపదికన పలు బోధనేతర (Non-Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూలై 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : లక్ష్మీబాయి కళాశాల (Lakshmibai College) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. లైబ్రేరియన్ – 01 పోస్టు
2. అసిస్టెంట్ – 01 పోస్టు
3. ల్యాబ్ అసిస్టెంట్ (హోమ్ సైన్స్) – 01 పోస్టు
4. జూనియర్ అసిస్టెంట్ – 06 పోస్టులు
5. లైబ్రరీ అటెండెంట్ – 08 పోస్టులు
6. ల్యాబ్ అటెండెంట్ (హోమ్ సైన్స్) – 06 పోస్టులు
7. ల్యాబ్ అటెండెంట్ (కంప్యూటర్) – 01 పోస్టు
మొత్తం ఖాళీలు : 24
విద్యార్హతలు :
పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ (12వ తరగతి), డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి పే లెవెల్ ప్రకారం నెలకు రూ.18,000/- నుండి రూ.1,77,500/- వరకు వేతనం అందజేస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ఆధారంగా నిర్వహిస్తారు.
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ టెస్ట్
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 20 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 01 జూలై 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Official Website Click Here