5వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రూప్-IV ఉద్యోగాలు| AP Backlog Group IV Recruitment 2026 Apply Now :
5వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రూప్-IV ఉద్యోగాలు| AP Backlog Group IV Recruitment 2026 Apply Now :
AP Backlog Group IV Recruitment 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పలు గ్రూప్-IV బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ శానిటరీ వర్కర్, ఆఫీస్ వాచర్ మరియు ANM Gr-III వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 20 మార్చి 2026 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు- ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – వికలాంగులు, TG & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
2. జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్
3. స్టోర్ కీపర్
4. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
5. ఆఫీస్ సబార్డినేట్
6. జూనియర్ శానిటరీ వర్కర్
7. ఆఫీస్ వాచర్
8. ANM Grade-III పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 50 పోస్టులు
రిక్రూట్మెంట్ విధానం: రెగ్యులర్ బేసిస్
విద్యా అర్హతలు :
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్:
UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:
సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్:
కనీసం VII తరగతి ఉత్తీర్ణత ఉండాలి మరియు సైకిల్ తొక్కగలగాలి.
జూనియర్ శానిటరీ వర్కర్:
గుర్తింపు పొందిన బోర్డు 10వ తరగతి పాస్.
ఆఫీస్ వాచర్:
5వ తరగతి పాస్ ఉండాలి. అలాగే మాజీ సైనికుడు లేదా హోమ్ గార్డ్/సివిల్ డిఫెన్స్ శిక్షణ ఉండాలి. సైకిల్ తొక్కగలగాలి.
ANM Gr-III (మహిళలు మాత్రమే):
1. మహిళా అభ్యర్థి అయి ఉండాలి.
2. MPHA (F) కోర్సు లేదా ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు అవసరం.
3. సంబంధిత బోర్డులో నమోదు అవసరం
వయోపరిమితి:
01 జూలై 2026 నాటికి అభ్యర్థి:
కనీస వయస్సు – 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు – 52 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,220 నుండి ₹80,910 వరకు జీతం చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ:
1. విద్యా అర్హత మెరిట్
2. ఇంటర్వ్యూ
3. రాత పరీక్ష ఉండదు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారాన్ని వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా క్రింది చిరునామాకు సమర్పించాలి.
చిరునామా:
Assistant Director,
Department for Welfare of Disabled, TG & Senior Citizens
“D” Block, New Collector Complex
YSR Kadapa District
2. దరఖాస్తు 20.03.2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించి రసీదు పొందాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 20 మార్చ్ 2026
Notification & Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now