NEET UG 2026 విద్యార్థులకు బిగ్ అలర్ట్.. MCC కౌన్సిలింగ్ పూర్తి మార్గదర్శకాలు విడుదల..
NEET UG 2026 విద్యార్థులకు బిగ్ అలర్ట్.. MCC కౌన్సిలింగ్ పూర్తి మార్గదర్శకాలు విడుదల..
NEET MCC Counselling Guidelines 2026:
నీట్ యూజీ (NEET UG) 2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సిలింగ్ నిర్వహణకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కౌన్సిలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కళాశాలల్లో MBBS, BDS సీట్లను భర్తీ చేయనున్నారు.
NEET UG ఫలితాల అనంతరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ అయిన MCC కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. అభ్యర్థులు కౌన్సిలింగ్లో పాల్గొనే ముందు అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
MCC కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
1. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ :
అర్హత సాధించిన అభ్యర్థులు MCC అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం నిర్దేశించిన Non-Refundable Counselling Fee మరియు Refundable Security Depositను ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
2. ఛాయిస్ ఫిల్లింగ్ (Choice Filling) :
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమకు కావలసిన మెడికల్ కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలి. ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేస్తే సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
3. ఛాయిస్ లాకింగ్ (Choice Locking) ;
ఎంపిక చేసిన కాలేజీలు, కోర్సుల జాబితాను గడువు ముగిసేలోపు తప్పనిసరిగా లాక్ చేయాలి. గడువు వరకు లాక్ చేయకపోతే సిస్టమ్ స్వయంచాలకంగా చివరిగా సేవ్ చేసిన ఎంపికలను లాక్ చేస్తుంది. ఒకసారి లాక్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు.
4. సీట్ల కేటాయింపు (Seat Allotment) :
అభ్యర్థులు సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), రిజర్వేషన్ కేటగిరీ, అందుబాటులో ఉన్న సీట్లు, అలాగే వారు నమోదు చేసిన కాలేజీ మరియు కోర్సు ప్రాధాన్యతల ఆధారంగా కంప్యూటరైజ్డ్ విధానంలో సీట్ల కేటాయింపు చేపడతారు.
5. కాలేజీలో రిపోర్టింగ్ :
సీటు పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి సీట్ అలాట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్దేశించిన తేదీల్లోపు కేటాయించిన మెడికల్ కళాశాలలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
గమనిక: MCC కౌన్సిలింగ్ సాధారణంగా పలు రౌండ్లలో నిర్వహించబడుతుంది.కౌన్సిలింగ్‌కు సంబంధించిన ప్రతి రౌండ్ షెడ్యూల్, తాజా నోటిఫికేషన్లు, కీలక సూచనలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం తప్పనిసరి.