Breaking News : తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల | TS Court Computer Based Examination Schedule 2026 :
Breaking News : తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల | TS Court Computer Based Examination Schedule 2026 :
TS District Court Exams 2026 :
కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన హైకోర్టు , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పరిధిలోని ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షల తేదీలను తెలంగాణ హైకోర్టు అధికారికంగా ప్రకటించింది. పోస్టుల వారీగా షిఫ్ట్‌ల ప్రకారం పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ పోస్టుల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన హైకోర్టు, అర్హత కలిగిన అభ్యర్థులకు క్రింది షెడ్యూల్ ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
పోస్టుల వారీగా పరీక్ష తేదీలు:
ఎగ్జామినర్ పోస్టులు :
24 జూన్ 2026
షిఫ్ట్ – 1
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు :
24 జూన్ 2026
షిఫ్ట్ – 2
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు :
24 జూన్ 2026 నుంచి 25 జూన్ 2026 వరకు
షిఫ్ట్‌లు – 1, 2 మరియు 3
రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు :
28 జూన్ 2026
షిఫ్ట్‌లు – 1 మరియు 2
హాల్ టికెట్లు ఎప్పటి నుంచి?
సంబంధిత అభ్యర్థులందరూ తమ కంప్యూటర్ ఆధారిత పరీక్షల హాల్ టికెట్లను 17 జూన్ 2026 నుంచి తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరుకావాల్సిందిగా అధికారులు సూచించారు.
ముఖ్యమైన వివరాలు:
సంస్థ : తెలంగాణ హైకోర్టు
పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చే తేదీ : 17 జూన్ 2026
అధికారిక వెబ్‌సైట్ : www.tshc.gov.in
హెల్ప్‌డెస్క్ నంబర్ : 040-23688394
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శిస్తూ తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించబడుతోంది.
TS District Court Computer based examination 2026 schedule
Official Website Click Here