TS Inter 2026 Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ & పూర్తి వివరాలు:
TS Inter 2026 Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ & పూర్తి వివరాలు:
Telangana Inter Results 2026 పూర్తి వివరాలు:
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 ఉదయం అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు.
మొదటగా ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసి, అనంతరం రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలను ప్రకటిస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు SMS ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
TS Inter 2026 Results ఎలా చెక్ చేయాలి?
1. ముందుగా అధికారిక ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజీలో “TS Inter 2026 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీరు రాసిన సంవత్సరం (1st Year / 2nd Year) ఎంపిక చేసుకోండి.
4. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు జనన తేదీ నమోదు చేయండి.
5. “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
6. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
7. సబ్జెక్ట్ వారీగా మార్కులు మరియు పాస్/ఫెయిల్ స్టేటస్ చెక్ చేసుకోండి.
TS Inter Supplementary Exams 2026 వివరాలు:
ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత:
ఫస్ట్ ఇయర్ మార్కులు మెరుగుపరచుకోవాలనుకునే విద్యార్థులు, ఫెయిల్ అయిన మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు
సప్లమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు.
1. ఈ సప్లమెంటరీ పరీక్షలు సాధారణంగా మే నెల మొదటి లేదా రెండవ వారంలో నిర్వహించబడతాయి.
2. ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఏప్రిల్ 30
3. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా లేదా తమ కాలేజ్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ముఖ్య సమాచారం:
ఫలితాలు: ఏప్రిల్ 12 విడుదల
చెక్ చేసే విధానం: ఆన్‌లైన్ & SMS
సప్లమెంటరీ పరీక్షలు: మే నెలలో
ఫీజు చివరి తేదీ: ఏప్రిల్ 30