TTD ఉద్యోగాలు 2026: ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షా షెడ్యూల్ విడుదల :
TTD ఉద్యోగాలు 2026: ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షా షెడ్యూల్ విడుదల :
TTD పరీక్ష షెడ్యూల్ 2026 :
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పలు కీలక పోస్టుల కోసం నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) షెడ్యూల్‌ను Tirumala Tirupati Devasthanams అధికారికంగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్), అలాగే AEE (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
TTD పరీక్ష షెడ్యూల్ 2026 – ముఖ్య సమాచారం:
1. ఇంజనీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
2. CBT పరీక్షలు మే 10 మరియు 11, 2026 తేదీల్లో నిర్వహణ.
3. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎంపికకు ఏప్రిల్ 29, సాయంత్రం 6 గంటల వరకు అవకాశం.
4. హాల్ టికెట్లు మే 2 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

పరీక్షా షెడ్యూల్ వివరాలు :
తేదీ : మే 10, 2026
ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు – AEE (సివిల్)
మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు – AEE (ఎలక్ట్రికల్)
తేదీ : మే 11, 2026
ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు – AE (సివిల్)
మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు – ATO (సివిల్)

హాల్ టికెట్ & ఇతర వివరాలు :
అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 2వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరు కావడానికి ముందుగా తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాలి.
సహాయం కోసం:
పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం TTD టోల్ ఫ్రీ నెంబర్ 155257ను సంప్రదించవచ్చు. తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించడం మంచిది.
Exam Center Preferences Click Here
Official Website Click Here